కేరళ కోజికోడ్‌లోని పెరంబరాకు చెందిన హారిస్.. ఆత్మవిశ్వాసంతో తన వైకల్యాన్ని జయించారు. 23 ఏళ్ల క్రితం ప్రమాదంలో రెండు కాళ్లు పోయి.. మంచానికే పరిమితమైనా సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు. మంచంపైనుంచే పదేళ్లుగా గొడుగులు తయారు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.




అయితే కరోనా కారణంగా తన గొడుగుల వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని.. హారిస్ తెలిపారు. న్యూ లైఫ్ స్వచ్ఛంద సంస్థ చొరవతో ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో ఆర్డర్లు వస్తున్నాయని, వారికి సరఫరా చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి : 5 కి.మీ. భుజాలపై మోసి.. ఆస్పత్రిలో చేర్చి..