దేశ రాజధాని దిల్లీలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టేందుకు తెచ్చిన జీఎన్సీటీడీ బిల్లును.. కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ కోరారు. తమ ప్రభుత్వాన్ని బలహీన పరచాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు.
లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సభలో పాల్గొని ప్రసగించిన కేజ్రీవాల్ కేంద్రపై విమర్శలు గుప్పించారు. ఈ చట్టం ద్వారా ప్రజలను మోసం చేయొద్దని కేంద్రానికి..కేజ్రీవాల్ సూచించారు. తమ అభివృద్ధిని భాజపా ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. వెంటనే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: బంగాల్ దంగల్: కీలక స్థానాల్లో జంప్జిలానీల పాగా!