ETV Bharat / bharat

ఆ సర్పంచ్​ను పొట్టనబెట్టుకున్న ముగ్గురు ముష్కరులు హతం - కశ్మీర్​ వార్తలు

kashmir Encounter: కశ్మీర్​లో ఎన్​కౌంటర్​ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు. కొద్దిరోజుల క్రితం ఖాన్మోహ్​లో సర్పంచ్​ను చంపింది వీరేనని పోలీసులు ధ్రువీకరించారు.

Kashmir Encounter breaks out in Srinagar's Nowgam

author img

By

Published : Mar 16, 2022, 10:57 AM IST

kashmir Encounter: కశ్మీర్​ శ్రీనగర్​లో ముగ్గురు ముష్కరులను హతమార్చింది భారత సైన్యం. వీరిని లష్కరే తోయిబాకు చెందినవారిగా గుర్తించారు. ఖాన్మోహ్​లో కొద్దిరోజుల క్రితం సర్పంచ్​ను చంపింది వీరేనని పోలీసులు ధ్రువీకరించారు.

నౌగామ్​ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న సమాచారంతో.. భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో మిలిటెంట్లు కాల్పులు జరిపారు. తిప్పికొట్టిన బలగాలు.. వారిని మట్టుబెట్టాయి.

సంఘటనా స్థలంలో మందుగుండు సామగ్రి, భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి.

మార్చి 9న జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ శివారులో ఖాన్మోహ్​ సర్పంచ్​ సమీర్​ భట్​ను కాల్చి చంపేశారు. నిషేధిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ముష్కరులు ఈ ఘటనకు బాధ్యులమని ప్రకటించారు.

ఇవీ చూడండి: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. సర్పంచ్ దారుణ హత్య

రసాయన దాడుల ముప్పు.. ఉక్రెయిన్​ ప్రజల్లో గుబులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.