kasganj road accident: ఉత్తర్ప్రదేశ్, కాస్గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బొలెరో వాహనం ఢీకొనటం వల్ల ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఫరుఖాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు పాటియాలలోని బోలే బాబా ఆశ్రమానికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఆటోలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
ఇదీ చూడండి : 80 అడుగుల మరో వంతెన మాయం.. ఈసారి పక్క జిల్లాలో!