ETV Bharat / bharat

Kasani Gnaneshwar Resigns from TTDP : తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా - టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన కాసాని

Kasani Gnaneshwar Resigns from TTDP : తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి అధిష్ఠానం నిరాకరించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Kasani Gnaneshwar
Kasani Gnaneshwar Resigns from TTDP
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 8:03 PM IST

Updated : Oct 30, 2023, 8:33 PM IST

Kasani Gnaneshwar Resigns from TTDP : తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి అధిష్ఠానం నిరాకరించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కాసాని జ్ఞానేశ్వర్ ఆదివారం ఎన్టీఆర్‌ భవన్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి అధిష్ఠానం నిరాకరించినట్టు శ్రేణులకు తెలిపారు. దీనిపై కొందరు నేతలు స్పందిస్తూ.. పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలో కాసాని జ్ఞానేశ్వర్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఇంతలోనే పార్టీ అధ్యక్ష పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేయడం గమనార్హం.

TDP Contesting Issue on TS Assembly Election 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం.. నిరసన వ్యక్తం చేసిన కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్​లోని రాజమండ్రి జైలులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శనివారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందో నేతలకు వివరించాలని కాసానికి సూచించారు. చంద్రబాబు నిర్ణయాన్ని టీడీపీ సీనియర్ నేతలు.. తెలంగాణ నేతలకు వివరించారు.

ఇదే విషయంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కాట్రగడ్డ ప్రసూన, జీవీజీ నాయుడు, సాయిబాబా సహా పలువురు నేతలు, జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఈసారి దూరంగా ఉండాలన్న అధిష్ఠానం నిర్ణయాన్ని వెల్లడించారు. ఊహించని ఈ పరిణామంతో కార్యకర్తల నుంచి నిరసన జ్వాలలు రేకెత్తాయి. అధిష్ఠానం నిర్ణయంతో కాసాని జ్ఞానేశ్వర్‌ సైతం కన్నీటి పర్యంతమయ్యారు.

TDP Clarity on Telangana Elections Contest : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయం

ఈ సందర్భంగా అధిష్ఠానం నిర్ణయం పట్ల పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కోసం అనుక్షణం కష్టపడింది ఎన్నికల కోసమే అని.. ఇప్పుడు ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దని లోకేశ్ చెప్పారని.. కార్యకర్తల అభిప్రాయాన్ని మరోమారు అధినేత బాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని కాసాని వారిని సముదాయించారు. ఇంతలోనే పార్టీ అధ్యక్ష పదవికి, సభ్యత్వానికి రెండింటికీ రాజీనామా చేశారు.

Kasani Gnaneshwar on Chandrabau Health : 'జైలులో బాబుకు ఏదైనా జరిగితే.. జగన్ సర్కారే బాధ్యత వహించాలి'

అయితే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈసారి కచ్చితంగా పోటీ చేస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ గతంలో ప్రకటించారు. దానికి అనుగుణంగానే తొలి విడత సన్నాహాల్లో 87 మంది అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టో రూపకల్పన చేసి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. కానీ ఇప్పుడు పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.

TDP Leader Nara Lokesh Emotional Speech: "ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాం".. టీడీపీ నేతల ముందు లోకేశ్ కంటతడి

Last Updated : Oct 30, 2023, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.