కర్ణాటక ఉడిపికి చెందిన 65ఏళ్ల గంగాధర్.. కాళ్లకు ఇనుప గొలుసు కట్టుకుని పద్మాసనం వేస్తూ అరేబియన్ సముద్రంలో ఈత కొట్టారు. 1400 మీటర్లను కేవలం గంటా 13 నిమిషాల 7 సెకన్లు ఈది.. 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు సంపాదించుకున్నారు.
ఛాతితోనే స్మిమ్మింగ్
పద్మాసనం వేస్తూ 800 మీటర్లు మేర.. ఛాతితో(బ్రెస్ట్ స్ట్రోక్) ఈతకొట్టిన గంగాధర్‌ను చూసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఈత కొట్టటంలో గంగాధర్ ఇదివరకే చాలా రికార్డుల్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో 2009 నుంచి 2019 వరకు మొత్తం 31 బంగారు, 16 వెండి, 8 రజత పతకాలను సాధించారు.
గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ బంగారు పతకాలు సాధించారు గంగాధర్.
ఇదీ చదవండి : 'అలా చేస్తేనే బంగాల్లో భాజపా విస్తరణ'