ETV Bharat / bharat

ప్రియుడితో భార్య పరార్​​.. కోపంతో ఇద్దరు కుమార్తెలను హత్య చేసిన భర్త! - కలబురిగిలో జిల్లా వార్తలు

కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కడతేర్చాడు. భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని.. ఇద్దరు కుమార్తెలను చంపేశాడు ఓ కిరాతక తండ్రి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

man kills two daughters
ఇద్దరు కుమార్తెల్ని హతమార్చిన తండ్రి
author img

By

Published : Jun 30, 2022, 11:48 AM IST

Updated : Jun 30, 2022, 12:04 PM IST

తండ్రిగా వారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన వ్యక్తే.. వారిపాలిట కాల యముడిగా మారాడు. భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని.. కోపంతో కన్న కుమార్తెలిద్దర్ని కడతేర్చాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగిలో జరిగింది. నిందితుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే: నిందితుడు లక్ష్మీకాంత్​(34) ఆటో డ్రైవర్​. అతడు కలబురగిలోని బాంబో బజార్​ నివాసి. ఆయన భార్య పేరు అంజలి. కొన్నాళ్ల క్రితం ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. నాలుగు నెలల క్రితం అంజలి వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. అప్పటి నుంచి లక్ష్మీకాంత్​ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. అనంతరం మద్యానికి బానిసయ్యాడు. అంజలి వేరే వ్యక్తితో పారిపోయినప్పటి నుంచి ఆమె పిల్లలు అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటున్నారు.

నిందితుడు లక్ష్మీకాంత్​.. తన పిల్లలను చూడడానికి మంగళవారం అత్తవారింటికి వెళ్లాడు. వారిలో సోని(10), మయూరి (8) అనే ఇద్దరు కుమార్తెలను తీసుకుని ఎంబీ నగర్​ పోలీస్​ స్టేషన్​ సమీపంలోని పార్కుకు తీసుకెళ్లాడు. అనంతరం వారిని తన ఆటోలోనే గొంతు నులిమి హత్య చేశాడు. నిందితుడు తన పిల్లల మృతదేహాలను వెనుక సీటు కింద పెట్టి రోజంతా నగరంలో తిరిగాడు. సీటు కింద మృతదేహాలు ఉన్న విషయం తెలియక చాలా మంది ప్రయాణికులు ఆటోలో ప్రయాణించారు.

ఇవీ చదవండి: 'మరుగుదొడ్ల స్కాం'.. 40లక్షల మంది రెండోసారి దరఖాస్తు!

బోరుబావిలో పడ్డ ఐదేళ్ల బాలుడు సేఫ్​.. 8 గంటలు శ్రమించిన రెస్క్యూ టీం

Last Updated : Jun 30, 2022, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.