ఎండలు మండి పోతున్నాయి. మనుషులే కాదు, పశుపక్ష్యాదులూ దాహంతో విలవిల్లాడుతున్నాయి. మనుషులైతే ఎలాగైనా నీటిని తెచ్చుకుంటారు. మూగజీవాలు అలాకాదు కదా. అందుకే పక్షుల కోసం గార్డెన్లలో నీళ్ల సదుపాయం కల్పించి మానవత్వాన్ని చాటుకుంటోంది కర్ణాటకలోని కలబురిగి నగర పాలక సంస్థ
"ఎండలు పెరగడం వల్ల నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. పక్షుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాటికి నీరు దొరకడం కష్టమైంది. అందుకే గార్డెన్లలోకి తరచూ వచ్చే పక్షుల కోసం నీటి కేంద్రాల్ని ఏర్పాటు చేశాం."
-స్నేహాల్ లోకండే, కలబురిగి నగర కార్పొరేషన్ కమిషనర్
ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్, బస్టాండ్లలో చలివేంద్రాల్ని ఏర్పాటు చేశామని కలబురిగి నగర కార్పొరేషన్ కమిషనర్ తెలిపారు.
ఇదీ చదవండి: గుర్రాల ఆకలి తీర్చుతున్న బాలిక