ETV Bharat / bharat

Karnataka JDS President Expelled : బీజేపీతో పొత్తుకు నో చెప్పడంపై గుస్సా.. రాష్ట్ర అధ్యక్షుడిపై వేటు వేసిన దేవెగౌడ​

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 1:44 PM IST

Updated : Oct 19, 2023, 2:30 PM IST

Karnataka JDS President Expelled : పార్టీ అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపించిన జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంపై ఆ పార్టీ అధినేత దేవెగౌడ చర్యలు తీసుకున్నారు. ఇబ్రహీంను జేడీఎస్​ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కుమారస్వామిని నియమించారు.

Karnataka JDS President Expelled
Karnataka JDS President Expelled

Karnataka JDS President Expelled : ఎన్​డీఏతో పొత్తు పెట్టుకోవడంపై జేడీఎస్ అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగురవేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంపై వేటు పడింది. ఇబ్రహీంను జేడీఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్​డీ దేవెగౌడ గురువారం ప్రకటించారు. అలాగే రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు.. సీఎం ఇబ్రహీం స్థానంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తాత్కాలికంగా నియమించారు దేవెగౌడ.

  • Karnataka JD(S) president CM Ibrahim expelled from the post, says JD(S) national president HD Deve Gowda.

    — ANI (@ANI) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పార్టీని బలోపేతం చేయడానికి జేడీఎస్​ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దు చేశారని తెలిపారు కర్ణాటక మాజీ సీఎం హెచ్​డీ కుమారస్వామి. తన నాయకత్వంలో తాత్కాలిక కమిటీని ప్రకటించారని అన్నారు. 'పార్టీని బలోపేతం చేయడం నా బాధ్యత. అలాగే పార్టీని అభివృద్ధి చేయడంపై నేను ఏకాగ్రతగా ఉన్నాను' అని తెలిపారు.

ఇటీవలే ఎన్డీఏలో జేడీఎస్​ చేరడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సీఎం ఇబ్రహీం. ఎన్డీఏలో జేడీఎస్​ చేరికపై పార్టీ అధినేత దేవెగౌడ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడారు. పార్టీలో చీలిక ఏర్పడ్డట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారు. తమదే అసలైన 'సెక్యులర్' వర్గమని ప్రకటించుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని ఆ పార్టీ అధినేత దేవెగౌడకు విజ్ఞప్తి చేశారు.

BJP JDS Alliance In Karnataka 2023 : జేడీఎస్​ అధినేత దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి.. తన నిర్ణయంతో ఏకీభవించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటన్న ప్రశ్నపై ఇబ్రహీం బదులిచ్చారు. తాను జేడీఎస్​ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినని.. కర్ణాటకలో పార్టీకి సంబంధించి నిర్ణయాలు తానే తీసుకుంటానని చెప్పుకొచ్చారు. బీజేపీతో కలిసి వెళ్లబోమని స్పష్టం చేశారు. ఒకవేళ దేవెగౌడ, కుమారస్వామి బీజేపీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లయితే వెళ్లనివ్వండంటూ వ్యాఖ్యానించారు.

'బీజేపీతో పొత్తుకు వద్దని దేవెగౌడ, కుమారస్వామిని కోరుతున్నాం. అప్పటికి వాళ్లు బీజేపీతోనే వెళ్తే మేమేం చేయలేం. జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. సమయం వచ్చినప్పుడు అన్నీ తెలియజేస్తాను. చాలా మంది ఎమ్మెల్యేలు నాతో టచ్​లో ఉన్నారు. వారు పేర్లు చెప్పను. వారందరితో సమావేశం కూడా నిర్వహిస్తాను' అని ఇబ్రహీం తెలిపారు. ఈ క్రమంలో ఆయనపై దేవెగౌడ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Split In JDS : జేడీఎస్​లో చీలిక?.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు.. మేమే ఒరిజినల్​ అంటూ దేవెగౌడకు సవాల్!

JDS BJP Alliance : 'పార్టీ మనుగడ కోసమే బీజేపీతో పొత్తు.. కుమారస్వామి లాంటి సీఎం దేశంలోనే లేరు!'

Last Updated : Oct 19, 2023, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.