Karnataka Girl catching snakes: పాములను చూస్తే మనమంతా ఆమడ దూరం పరిగెడతాం. అదే విషసర్పాలైతే అంతే సంగతి. కానీ కర్ణాటకకు చెందిన ఓ యువతి పాములను అలవోకగా పట్టుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పట్టుకున్న పాములను సురక్షితంగా అడవిలోకి విడిచిపెడుతోంది. వందకు పైగా విషసర్పాలను బంధించి.. సెంచరీ కూడా కొట్టేసింది.
![Karnataka Girl catching snakes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mng-01-snake-rescue-script-ka10015_20012022142312_2001f_1642668792_1008_2001newsroom_1642680978_969.jpg)
Snake girl Sharanya Bhat:
మంగళూరులోని అశోక నగర ప్రాంతంలో నివాసం ఉండే శరణ్య భట్.. ప్రస్తుతం బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతోంది. చుట్టుపక్కల ఎవరి ఇళ్లలో అయినా పాములు చొరబడ్డాయంటే.. వెంటనే వెళ్లి తన టెక్నిక్‌తో సర్పాలను బంధించేస్తుంది. ఇప్పటివరకు... నాగుపాములు, కొండచిలువలు, నీటి పాములు సహా అనేక విషపూరితమైన సర్పాలను పట్టుకొని కాపాడింది. అన్ని జాగ్రత్తలు తీసుకునే పాములు పడతానని చెబుతోంది శరణ్య.
![Karnataka Girl catching snakes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mng-01-snake-rescue-script-ka10015_20012022142312_2001f_1642668792_39_2001newsroom_1642680978_990.jpg)
"కొన్నిసార్లు పాము మనపైనా దాడి చేసే అవకాశం ఉంది. పరిస్థితిని బట్టి పాములు మనల్ని కరిచే అవకాశం ఉంటుంది. పాములను పట్టుకునేందుకు కొన్నిసార్లు పెద్ద పరికరాలు వాడినా అవి మనల్ని కరవొచ్చు. హుక్-హ్యాండిల్ పద్ధతిలో పాములను పట్టుకుంటే పెద్దగా ప్రమాదం ఉండదు."
-శరణ్య భట్, పాములు పట్టే యువతి
Snake conservation Karnataka girl: తన తాతయ్య ప్రకాశ్ బాల్టిలైర్ ఇంటికి వెళ్లినప్పుడల్లా.. పాములు, ఇతర జీవుల గురించి చెప్పేవారని, దీంతో వీటి సంరక్షణపై ఆసక్తి ఏర్పడిందని శరణ్య చెబుతోంది. వాహనాల కింద పడి అనేక సర్పాలు మరణిస్తున్నాయని, కాబట్టి ప్రతి పాము సంరక్షణా ముఖ్యమేనని అంటోంది.
![Karnataka Girl catching snakes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mng-01-snake-rescue-script-ka10015_20012022142312_2001f_1642668792_603_2001newsroom_1642680978_473.jpg)
![Karnataka Girl catching snakes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mng-01-snake-rescue-script-ka10015_20012022142312_2001f_1642668792_233_2001newsroom_1642680978_350.jpg)
"పాములను సంరక్షించడం చాలా అవసరం. రోడ్లపై చాలా పాములు చనిపోతున్నాయి. చిన్న సర్పాలే కాదు ఎనిమిది, తొమ్మిది అడుగులు ఉన్న కొండచిలువలు కూడా వాహనాల కింద పడి మరణిస్తున్నాయి. నాగుపామును దైవంగా భావించి చాలా మంది గౌరవిస్తుంటారు. మిగిలిన పాముల మీద అలాంటి గౌరవం ఉండదు. అలాగని, ఇతర పాములు మంచివి కావు అనే భావనలో ఉండొద్దు. సంరక్షణ విషయానికి వస్తే ప్రతి పాము చాలా ముఖ్యమే."
-శరణ్య భట్, పాములు పట్టే యువతి
పాములను పట్టుకోవడంలో నేర్పు సాధించిన శరణ్య.. ఇప్పుడు కప్పలపై అధ్యయనం చేస్తోంది. వన్యప్రాణులు, వాటి సంరక్షణపై ఎమ్మెస్సీ చేయాలని అనుకుంటోంది. అటవీ శాఖలో చేరడమే తన లక్ష్యంగా పెట్టుకుంది.
![Karnataka Girl catching snakes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mng-01-snake-rescue-script-ka10015_20012022142312_2001f_1642668792_713_2001newsroom_1642680978_53.jpg)
వన్యప్రాణులే కాక, సంగీతం, డాన్స్ అంటే కూడా శరణ్యకు ఆసక్తి ఉంది. కర్ణాటక సంగీతం, భరతనాట్యంలో శిక్షణ తీసుకుంటోంది.
![Karnataka Girl catching snakes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mng-01-snake-rescue-script-ka10015_20012022142312_2001f_1642668792_766_2001newsroom_1642680978_452.jpg)
ఇదీ చదవండి: