దేశంలో జాతీయ విద్యా విధానం-2020(ఎన్ఈపీ)ని అమలు చేయనున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచిందని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సీఎన్ అశ్వథ్ నారాయణ్ శనివారం తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరం నుంచి ఎన్ఈపీని అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.
"దేశంలో జాతీయ విద్యావిధానం-2020ను అమలు చేసే మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఎన్ఈపీ మార్గదర్శకాలనుసారం.. ఈ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తాం."
-సీఎన్ అశ్వథ్ నారాయణ్, కర్ణాటక విద్యాశాఖ మంత్రి.
అంతకుముందు.. కర్ణాటక ఉన్నత విద్యా మండలి, ఆ రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులతో అశ్వథ్ నారాయణ్ భేటీ అయ్యారు.
ఇదీ చూడండి: