ETV Bharat / bharat

ఎగ్జిట్ పోల్స్​ అంచనాలు అలా.. కర్ణాటక ఫలితాలు ఇలా.. - ఎగ్జిట్ పోల్స్ చరిత్ర

Karnataka Exit Poll 2023 : పోలింగ్ పూర్తయ్యాక.. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు నాయకులకు కంటి మీద కునుకు ఉండదు. అత్యధికులు ఎగ్జిట్​ పోల్స్​పై నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఓటరు నాడి పట్టుకోవటంలో ఎగ్జిట్​ పోల్స్ కొన్నిసార్లు విఫలమైతే, మరికొన్నిసార్లు సఫలమయ్యాయి. తాజాగా ఎన్నికలు జరిగిన కర్ణాటకలో దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్​ పోల్స్ అంచనాలు తప్పాయి.

Karnataka Exit Poll 2023
Karnataka Exit Poll 2023
author img

By

Published : May 13, 2023, 4:28 PM IST

Updated : May 14, 2023, 3:43 PM IST

Karnataka Exit Poll 2023 : ఎన్నికలేవైనా, ఏ దేశమైనా ఒపీనియన్​, ఎగ్జిట్​ పోల్స్​కు విశేష ప్రజాదరణ ఉంటుంది. కొన్నిసార్లు ఓటరు నాడి పట్టుకోవడంలో సఫలమైనా.. మరికొన్ని సార్లు విఫలమవుతున్నాయి. ఈ సారి కర్ణాటక ఎన్నికల్లో ఓటరు నాడి పసిగట్టడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. ఒక సంస్థ మినహా మిగతావన్నీ సరిగ్గా అంచనా వేయలేకపోయాయి.

2023 కర్ణాటక ఎగ్జిట్​ పోల్స్​..
కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు లేవని.. మెజార్టీ సంస్థల ఎగ్జిట్​ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్​, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని చెప్పాయి. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్​గా అవతరించే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్​ పోల్స్ చెప్పాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సంస్థ మాత్రమే కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 122-140 సీట్లు, బీజేపీ 62-80, జేడీఎస్ 20-25, ఇతరులు 0-3 చోట్ల విజయం సాధిస్తారని అంచనా వేసింది.

karnataka exit poll 2023
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్

అందుకు భిన్నంగా కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్​ స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. మొత్తం 224 సీట్లకు గాను కాంగ్రెస్​ 135 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 66 అసెంబ్లీ స్థానాలను గెలుపొందగా.. జేడీఎస్​ 19 సీట్లకే పరిమితమైంది.

మొత్తం సీట్లు224
కాంగ్రెస్​135
బీజేపీ66
జేడీఎస్​19
ఇతరులు 4

ఈశాన్య రాష్ట్రాల్లో తప్పని ఎగ్జిట్​ పోల్స్
Tripura Exit Poll 2023 : ఈ ఏడాది ఫిబ్రవరిలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​కు జరిగిన ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ, నాగాలాండ్​ ఎన్​డీపీపీ-బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అలాగే మేఘాలయ కాన్రాడ్​ సంగ్మా నేతృత్వంలోని ఎన్​పీపీకే పట్టం కడతారని తెలిపాయి.

tripura exit poll 2023
ఈనాన్య రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్

ఎగ్జిట్​ పోల్స్ అంచనా వేసినట్లుగానే త్రిపురలో బీజేపీ కూటమి మొత్తం 60 స్థానాలకుగాను 33 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే నాగాలాండ్​లో ఎన్​డీపీపీ-భాజపా కూటమి 60 స్థానాలకుగాను 38 స్థానాల్లో గెలుపొందింది. అయితే ఎగ్జిట్​ పోల్స్ అంచనా వేసినట్లు.. మేఘాలయలో మాత్రం సొంతంగా మెజారిటీ మార్కును ఎన్​పీపీ సాధించలేకపోయింది. 26 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఫలితాల అనంతరం బీజేపీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

2022 గుజరాత్ ఎగ్జిట్ ​పోల్స్..
Gujarat Exit Poll 2022 : గుజరాత్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వరుసగా ఏడోసారి కమలదళం జయభేరి మోగిస్తుందని అన్ని సంస్థల సర్వేలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్‌ రెండో స్థానానికి పరిమితం అవుతుందని.. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ పెద్దగా ఉనికి చాటుకోలేదని ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొన్నాయి.

gujarat exit poll 2022
గుజరాత్ ఎగ్జిట్ పోల్స్

ఎగ్జిట్ పోల్స్​ చెప్పినట్టుగానే గుజరాత్​లో బీజేపీ రికార్డు విజయం సాధించింది. వరుసగా ఏడోసారి విజయం సాధించి 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. మొత్తం 182 స్థానాలకు 156 స్థానాల్లో విజయం సాధించి సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17, ఆప్‌ 5, ఇతరులు 4 స్థానాలకు పరిమితమయ్యారు. దక్కించుకున్నాయి.

హిమాచల్​ప్రదేశ్​ ఎగ్జిట్​ పోల్స్..
Himachal Pradesh Exit Poll 2022 : గతేడాది హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్​పోల్స్ ముందే అంచనా వేశాయి. కానీ మొత్తం 68 స్థానాలకు గాను.. కాంగ్రెస్​ పార్టీ 40 సీట్లను గెలుచుకుని అధికారం కైవసం చేసుకుంది. గుజరాత్​లో ఘన విజయం సాధించిన బీజేపీ.. హిమాచల్​లో​ మాత్రం 25 సీట్లకే పరిమితమైంది. ఆమ్​ఆద్మీ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. కాగా, ముగ్గురు స్వతంత్రులు శాసనసభకు ఎన్నికయ్యారు.

himachal pradesh exit poll 2022
హిమాచల్ ప్రదేశ్​ ఎగ్జిట్ పోల్స్

అంతకుముందు ఇలా..
2022లో జరిగిన ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ వెల్లడించాయి. వాటి అంచనాలను నిజం చేస్తూ అధికార బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. చెప్పినట్లుగానే సమాజ్​వాదీ పార్టీ రెండో స్థానానికి పరిమితం అయ్యింది. మరోవైపు, పంజాబ్​లో ఓటర్లు మార్పు కోరుకున్నారని, ఈసారి అధికార కాంగ్రెస్‌కు గట్టి షాకిస్తూ.. ఆప్‌ వైపు మొగ్గనున్నారని ఎగ్జిట్​పోల్స్ స్పష్టం చేశాయి. ఆప్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పేర్కొన్నాయి. ఆ మాటలను నిజం చేస్తూ.. ఆప్​ 92 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. అధికార కాంగ్రెస్​ కేవలం 18 స్థానాలకే పరిమితం అయ్యింది.

2022లో జరిగిన ఉత్తరాఖండ్​ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయని ఎగ్జిట్​ పోల్స్​ పేర్కొన్నాయి. కానీ వాటి అంచనాలకు మించి కమలం పార్టీ రాణించింది. ఏకంగా 47 సీట్లను గెలుచుకుంది. మరోవైపు మణిపుర్​లో ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచినప్పటికీ, సరైన సమయంలో చక్రం తిప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ.. ఈ దఫా కూడా సొంతంగా అధికార పీఠాన్ని చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్​పోల్స్​ పేర్కొన్నాయి. అదే విధంగా ఏకైక అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది. ఎప్పట్లాగే గోవాలో హంగ్‌ తలెత్తే సంకేతాలు కనిపిస్తున్నాయని ఎగ్జిట్​ పోల్స్​ లెక్క కట్టాయి. అయితే భాజపా మ్యాజిక్​ ఫిగర్​కు ఒక్క అడుగు దూరంలో నిలిచి.. స్వతంత్రుల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

బంగాల్ ఎన్నికల్లో..
2021 బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి స్వల్ప ఆధిక్యంతో.. బీజేపీతో హోరాహోరీ పోరు ఉంటుందని అన్ని ఎగ్జిట్​ పోల్స్​ వెల్లడించాయి. అయితే.. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలకు భిన్నంగా టీఎంసీ అధిక సీట్లు సాధించింది. తమిళనాడు శాసనసభ పోరులో డీఎంకేకే విజయావకాశాలు ఉన్నాయని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. అవే అంచనాలు నిజమై.. డీఎంకే భారీగా సీట్లు సాధించింది. కేరళలో మరోమారు ఎల్​డీఎఫ్​కు మెజారిటీ వస్తుందని అన్ని ఎగ్జిట్​ పోల్స్​ తేల్చేశాయి. అంచనాలను నిజం చేస్తూ ఎల్​డీఎఫ్​ భారీ మెజారిటీతో మూడోసారి అధికారం చేపట్టింది. అసోంలో మరోమారు ఎన్డీఏకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అన్ని సర్వేలు తేల్చాయి. అదే విధంగా.. బీజేపీ నేతృత్వంలోని కూటమి మెజారిటీ సాధించింది. పుదుచ్చేరిలో అధికార మార్పిడి తప్పదని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. ఎన్డీఏ కూటమి మెజారిటీ సాధిస్తుందని తేల్చాయి. ఎగ్జిట్​ పోల్స్​ నిజం చేస్తూ.. ఫలితాలు వెలువడ్డాయి.

2019 సార్వత్రికంలో అంచనాలకు మించి..
2019 సాధారణ ఎన్నికలు ముగిసిన రోజే ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు విడుదలయ్యాయి. రెండోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనే మరోమారు అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి పలు సర్వే సంస్థలు. సుమారు 300 పైచిలుకు సీట్లు సాధిస్తుందని తెలిపాయి. కానీ ఏబీపీ న్యూస్​, నేత న్యూస్​ ఎక్స్​ మాత్రమే అధికార కూటమికి మెజారిటీ తగ్గిపోతుందని తెలిపాయి. ఎన్డీఏకు 267 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్​ చెప్పగా, న్యూస్​ ఎక్స్​ 242 వస్తాయని తెలిపింది.

అయితే.. బీజేపీ అంచనాలకు మించి అధిక స్థానాలతో సొంతంగానే మెజార్టీ సాధించింది. ఎన్డీఏ 353 స్థానాలు గెల్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 కంటే 21 సీట్లు అధికంగా గెలిచి బీజేపీ ఆధిపత్యం చెలాయించింది. యూపీఏ 90 సీట్లకే పరిమితమైంది.

2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..
2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సునామీ సృష్టించిన ఏడాది తర్వాత దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఆమ్​ఆద్మీ, కాంగ్రెస్​ హోరాహోరీ తలపడ్డాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న దిల్లీలో ఆప్​ 40-45 సీట్ల వరకు గెలుస్తుందనుకున్న ఎగ్జిట్​ పోల్స్​ అంచనాల నేపథ్యంలో.. వాటిని తలకిందులు చేస్తూ ఆప్​ 70కి 67 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది.

బిహార్​లోనూ అంతే..
2015 బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్​ మహాకూటమి మధ్యే. 243 అసెంబ్లీ స్థానాల్లో ఎగ్జిట్​ పోల్స్​ భాజపాకు 100+ వస్తాయని, మహాకూటమి.. కాషాయ పార్టీ వెనుక ఉండొచ్చని అంచనా వేశాయి. ​అయితే ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. ఎన్​డీఏ 58 సీట్లకే పరిమితమైంది. జేడీయూ, ఆర్​ఎల్​డీ నేతృత్వంలోని మహాకూటమి 178 సీట్లతో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇక్కడా ఎగ్జిట్​ పోల్స్ ఓటరు నాడి పట్టుకోలేకపోయాయి.

2014 ఎగ్జిట్​ పోల్స్​..
2014లో మొత్తం 7 సంస్థలు తమ ఎగ్జిట్​ పోల్స్​ను ప్రకటించగా అందులో న్యూస్​-24 చాణక్య మాత్రమే దాదాపు కచ్చితమైన ఫలితాలను అంచనా వేయగలిగింది. ఎన్డీఏకు 340 సీట్లు వస్తాయని పేర్కొనగా.. అప్పటి ఎన్నికల్లో 336 సీట్లు వచ్చాయి. యూపీఏకు 70 సీట్లు అంచనా వేయగా 59 సీట్లు వచ్చాయి.

ఇవీ చదవండి:

Last Updated : May 14, 2023, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.