ETV Bharat / bharat

'బజరంగ్​దళ్, PFI​ బ్యాన్​.. పోలీసులు నైట్​ డ్యూటీ చేస్తే రూ.5వేలు'.. కాంగ్రెస్​ హామీల వర్షం - కర్ణాటక ఎన్నికలు 2023 కాంగ్రెస్​

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. 'సర్వ జనాంగద శాంతియ తోట'పేరుతో మేనిఫెస్టోను రిలీజ్​ చేశారు. కన్నడ ప్రజలపై హామీలు కురిపించారు.

karnataka elections 2023 congress party released manifesto

author img

By

Published : May 2, 2023, 10:38 AM IST

Updated : May 2, 2023, 12:18 PM IST

కర్ణాటకలో పోలింగ్​ సమయం దగ్గర పడుతున్న వేళ.. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. అధికార బీజేపీ సోమవారం.. ప్రజాప్రణాళిక పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేయగా తాజాగా కాంగ్రెస్​ పార్టీ 'సర్వ జనాంగద శాంతియ తోట' (అన్ని వర్గాల శాంతియుత ఉద్యానవనం) పేరుతో విడుదల చేసింది. కన్నడ ప్రజలపై హామీల వర్షం కురిపించింది. బజరంగ్​దళ్, PFI వంటి సంస్థలపై నిషేధం విధించి.. చట్ట ప్రకారం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది.

కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలు..

  • 2006 తర్వాత ఉద్యోగంలో చేరి పెన్షన్ పొందే ప్రభుత్వ ఉద్యోగులకు OPS పొడిగింపునకు చర్యలు
  • ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను సంవత్సరంలోగా భర్తీ
  • ఎస్సీలకు 15% నుంచి 17%, ఎస్టీలకు 3% నుంచి 7% రిజర్వేషన్లు పెంపు
  • మైనారిటీ రిజర్వేషన్లు 4% పునరుద్ధరిస్తామని హామీ
  • మత్స్యకారులకు ఏటా పన్ను రహిత 500 లీటర్ల డీజిల్​ పంపిణీ
  • లీన్​ పీరియడ్​లో మత్స్యకారులకు రూ.6000 అలవెన్సు
  • గ్రామాల్లో ఎరువుల కేంద్రాలు ఏర్పాటు.. రూ.3కే కిలో ఆవు పేడ కొనుగోలు
  • ఏడాదిలోపు బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన అన్ని ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు
  • జాతీయ విద్యా విధానం బదులు రాష్ట్ర విద్యా విధానం రూపకల్పన
  • రాత్రి విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు నెలకు రూ.5000 ప్రత్యేక భత్యం, నెల అదనపు వేతనం
  • కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం గడువులోగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు
    karnataka elections 2023 congress party released manifesto
    కాంగ్రెస్​ హామీలు

ఇప్పటికే ఉచిత కరెంటు, మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత బియ్యం, నిరుద్యోగ భృతి వంటి ఐదు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. అధికారంలోకి వస్తే 'గృహజ్యోతి' కార్యక్రమం ద్వారా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించకముందే హామీ ఇచ్చారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు 'గృహలక్ష్మి' పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతి నెల 2వేల రూపాయలు అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 'అన్న భాగ్య యోజన' పేరుతో ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చింది. నిరుద్యోగులకు నెల రూ.3 వేలు ఇస్తామని ప్రకటించింది. మహిళలను ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను.. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రోజే అమలుపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.

'అది కాంగ్రెస్​ మేనిఫెస్టో.. లేక పీఎఫ్ఐదా..!'
కర్ణాటకలో కాంగ్రెస్​ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు. పీఎఫ్​ఐపై ఇప్పటికే నిషేధం విధించామని చెప్పారు. సిద్ధరామయ్య ప్రభుత్వం పీఎఫ్​ఐపై పెట్టిన అనేక కేసులను ఉపసంహరించుకుందని ఆయన ఆరోపించారు. ముస్లింలను మభ్యపెట్టేందుకే బజరంగ్​దళ్​ను నిషేధిస్తామని కాంగ్రెస్​ చెబుతోందని ఆయన ఆరోపించారు. పీఎఫ్‌ఐ, ముస్లింల మద్దతు సంస్థల మేనిఫెస్టోలా కాంగ్రెస్​ మేనిఫెస్టో ఉందని ఆయన ఆరోపణలు చేశారు.

'ఉచితంగా సిలిండర్లు.. 'నందిని' పాలు'
బీజేపీ ప్రజా ప్రణాళిక పేరుతో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం అందించడం, సంక్షేమం కల్పించడమే బీజేపీ విజన్‌ అని తెలిపారు.

భాజపా మేనిఫెస్టోలోని ప్రధాన హామీలివే..

  • కర్ణాటకలో ఉమ్మడి పౌరస్మృతి అమలు
  • తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన
  • దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ప్రతి రోజు ఉచితంగా అర లీటరు నందిని పాలు
  • పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం, 5 కేజీల తృణధాన్యాలతో నెలవారీ రేషన్‌ కిట్‌.
  • దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ఏటా ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు (ఉగాది, వినాయక చవితి, దీపావళికి ఒక్కోటి చొప్పున)
  • కర్ణాటక యాజమాన్య చట్టం సవరింపు, ప్రతి వార్డుకో లాబోరేటరీ
  • మైసూరులోని ఫిల్మ్‌ సిటీకి దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు
  • ప్రతి వార్డులో అటల్‌ ఆహార కేంద్రాలు
  • నిరాశ్రయులకు 10 లక్షల ఇళ్ల స్థలాల కేటాయింపు
  • వృద్ధులకు ఉచితంగా వార్షిక హెల్త్‌ చెకప్‌లు
  • బెంగళూరుకు స్టేట్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్యాగ్
  • ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం
  • రూ.30వేల కోట్లతో మైక్రో కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాల కల్పన
  • రూ.1500 కోట్లతో పర్యాటక రంగ అభివృద్ధి

Karnataka Election 2023 : కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ రాష్ట్రంలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 114 సీట్లతో బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్​కు 76, జేడీఎస్​కు 26 సీట్లు ఉండగా.. 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

Last Updated : May 2, 2023, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.