ETV Bharat / bharat

ఫ్రాన్స్​ బాస్టిల్ డే పరేడ్​లో భారతీయ నారీ శక్తి.. దిశా అమృత్​కు అరుదైన అవకాశం - దిశా అమృత్​ తల్లిదండ్రులు

Disha Amrith Navy Officer : భారత నేవీ అధికారిణి దిశా అమృత్​ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. బాస్టిల్ డే పరేడ్ (ఫ్రాన్స్​ జాతీయ దివోత్సవం)​లో భారత నావిక దళ కవాతు బృందానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. దిశ ఇంతకుముందు ఈ ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్​లో కూడా కవాతు బృందానికి నాయకత్వం వహించారు.

disha amrith navy officer
disha amrith navy officer
author img

By

Published : Jul 11, 2023, 6:15 PM IST

Disha Amrith Navy Officer : ఈ ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్​లో నావికా దళ కవాతు బృందానికి నాయకత్వం వహించి దేశం గర్వించేలా చేశారు మంగళూరుకు చెందిన నేవీ అధికారిణి దిశా అమృత్​. ఈసారి బాస్టిల్ డే పరేడ్ (ఫ్రాన్స్​ జాతీయ దినోత్సవం)​లో కూడా పాల్గొనే అరుదైన అవకాశం దక్కించుకున్నారు.
Bastille Day Parade 2023 Modi : జులై 14న జరిగే ఈ పరేడ్​కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. భారతీయ త్రివిధ దళాలకు చెందిన కవాతు బృందాలు కూడా పాల్గొంటున్నాయి. అయితే, ఈ ఏడాది భారత్​-ఫ్రాన్స్​ ద్వైపాక్షిక భాగస్వామ్యం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ పరేడ్​లో పాల్గొనేందుకు త్రివిధ దళాలకు చెందిన కవాతు బృందాలు పారిస్​ చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాయి. నేవీ కవాతు బృందంలో దిశా అమృత్​తో సహా నలుగురు నావికా దళ అధికారులు, 64 నావికులు ఉన్నారు. పరేడ్​లో ఈ కవాతు బృందానికి.. కమాండర్​ వ్రత్​ భగేల్​, లెఫ్టినెంట్ కమాండర్​ దిశా అమృత్​, లెఫ్టినెంట్ కమాండర్ రజత్ త్రిపాఠి, లెఫ్టినెంట్ కమాండర్ జితిన్ లలితా ధర్మరాజ్ ప్రాతినిధ్యం వహిస్తారు.

Disha Amrith Biography : మంగళూరులోని బోలూరు సమీపంలోని తిలక్ నగర్‌కు చెందిన అమృత్ కుమార్, లీలా దంపతుల కుమార్తె దిశా అమృత్. దిశ స్థానిక కెనరా స్కూల్లో పాఠశాల విద్యనభ్యసించారు. 8వ తరగతి నుంచి ఎన్‌సీసీలో చేరారు. పాఠశాలలో చదువుతున్నప్పుడే దిల్లీలోని కర్తవ్యపథ్​లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపికయ్యారు. బెంగళూరులోని బీఎంఎస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. కొన్నేళ్ల పాటు అమెరికాకు చెందిన ఓ ఐటీ కంపెనీలో పనిచేశారు దిశ. అయితే తను మంచి ఉద్యోగంలో స్థిరపడినప్పటికీ సంతృప్తి చెందలేదు. ఎందుకంటే చిన్న వయసు నుంచే రక్షణ రంగంలోకి రావాలన్నది ఆమె ఆశయం. తన తండ్రి కల కూడా అదే. అందుకే ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి దేశసేవ చేయడానికి సిద్ధపడ్డారు దిశా అమృత్.

disha amrith navy officer
లెఫ్టినెంట్​ కమాండర్​ దిశా అమృత్

Disha Amrith Republic Day : ఇంజినీరింగ్​ పూర్తి చేసిన దిశ 2016లో నేవీలో చేరారు. ఏడాది శిక్షణ తర్వాత అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఆమెకు పోస్టింగ్‌ వచ్చింది. ప్రస్తుతం అక్కడే నేవల్ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకలలో కూడా నావికా దళ కవాతు బృందానికి దిశ నాయకత్వం వహించారు. ఫ్రాన్స్​ బాస్టిల్​ డే పరేడ్​లో భారత నేవీ కవాతు దళానికి​ ప్రాతినిధ్యం వహించే అవకాశం దిశకు రావడంపై ఆమె తండ్రి స్పందించారు. దిశకు చిన్నప్పటి నుంచే నేవీ అధికారి కావాలని కోరిక ఉండేదని.. తమ కుమార్తె ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.