పోలీస్ అంటే ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలబడే వ్యక్తి! కానీ, ఓ వ్యక్తి మాత్రం అలాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉండి కూడా.. కీచక పర్వం సాగించాడు. ఓ అత్యాచార కేసులో బాధితురాలిని లైంగికంగా వేధించాడు. ఆమె గర్భం దాల్చేందుకు కారణమయ్యాడు. ఆఖరుకు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో(Karnataka News) జరిగింది.
అసలేం జరిగింది?
దక్షిణ కన్నడ జిల్లా(Karnataka Dakshina Kannada News) కడబ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే శివరాజ్.. అత్యాచార కేసులో ఓ బాధితురాలి ఇంటికి తరుచూ దర్యాప్తు కోసం వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆమెపై ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక ఆమెతో బలవంతంగా గర్భస్రావం చేసేందుకు యత్నించాడు. దీనిపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

"పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా కూతురిని ఆరు నెలలుగా కానిస్టేబుల్ శివరాజ్ లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడు. గర్భస్రావం చేయించుకోవాలని నా కూతురిని బలవంతం చేశాడు" అని బాధితురాలి తండ్రి తన ఫిర్యాదులో వాపోయాడు. శివరాజ్‌పై పోలీసులు పోక్సో చట్టం సహా ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడ్ని ఆరెస్టు చేశారు.
ఇదీ చూడండి: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. బాలికపై బాబాయి అత్యాచారం...!
ఇదీ చూడండి: పొలంలో చిన్నారి మృతదేహం- గ్రామస్థుల ఆందోళన