ETV Bharat / bharat

ఉచిత హామీల అమలుకు కర్ణాటక కేబినెట్ గ్రీన్​ సిగ్నల్​.. రాష్ట్రంపై భారం ఎంతంటే? - కర్ణాటక లేటెస్ట్ న్యూస్

Karnataka Congress Promises : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ ప్రకటించిన ఐదు ఉచిత హామీల అమలుకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చింది సిద్ధరామయ్య కేబినెట్​. కుల, మత బేధాలు లేకుండా ఉచిత హామీలను అమలు చేస్తామని శుక్రవారం ప్రకటించారు ముఖ్యమంత్రి. నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, మహిళలకు రూ.2,000 ఆర్థిక భృతి వంటి పథకాలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేస్తామని సిద్ధరామయ్య తెలిపారు.

congress five guarantees
congress five guarantees
author img

By

Published : Jun 2, 2023, 3:23 PM IST

Updated : Jun 2, 2023, 4:36 PM IST

Congress Five Guarantees : కర్ణాటకలో కాంగ్రెస్​ ఘన విజయానికి దోహదం చేసిన ఐదు ఉచిత హామీల అమలుకు సిద్ధరామయ్య కేబినెట్ అమోదం తెలిపింది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం మంత్రివర్గ సమావేశం తర్వాత తెలిపారు. కులం, మతం అనే తారతమ్యం లేకుండా ఐదు ఉచిత హామీలను ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేయాలని కేబినెట్​ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.

Karnataka Congress Promises : జులై 1 నుంచి గృహ జ్యోతి పథకం (ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం) అమలు అవుతుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. జులై వరకు కరెంట్​ బిల్లులు ప్రజలు చెల్లించాల్సిందేనని తెలిపారు. అన్న భాగ్య పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం అందిస్తామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. 'శక్తి' పథకం కింద కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని అన్నారు. అలాగే 'యువ నిధి' పథకం కింద నిరుద్యోగ పట్టభద్రులకు రూ.3 వేలు.. 2022-23లో పాసై.. నిరుద్యోగులుగా ఉన్న డిప్లొమా విద్యార్థులకు రూ.1,500.. 24 నెలల పాటు అందజేస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు.

Congress Guarantee In Karnataka : 'గృహ లక్ష్మి' పథకం కింద కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ప్రతి నెల రూ.2,000 అందిస్తామని సిద్ధరామయ్య తెలిపారు. ఈ పథకం కోసం అర్హులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేస్తుకోవాలని సూచించారు. జూన్​ 15న ఆన్​లైన్ దరఖాస్తు ప్రారంభమై.. జూలై 15న ముగుస్తుందని సిద్ధరామయ్య చెప్పారు. దరఖాస్తు సమయంలో లబ్ధిదారులు తమ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించాం. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఐదు హామీలపై కూలంకషంగా చర్చించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఐదు హామీలను అమలు చేయాలని నిర్ణయించాం. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, నేను హామీల అమలుపై సంతకం చేశాం. ఉచిత హామీలకు సంబంధించిన పథకాల ఫలాలు ప్రజలకు చేరేలా చూస్తాం.
--సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి

ప్రభుత్వ ఖజానాపై భారం ఎంతంటే?..
ఎన్నికల్లో కాంగ్రెస్​ ఇచ్చిన 5 ప్రధాన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.50వేల కోట్లకుపైగా భారం పడనుందని అంచనా.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు..
Karnataka Election Results : ఈ ఏడాది మే 10న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలు అసెంబ్లీ స్థానాలకుగాను మే 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీ 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్‌ 19 స్థానాలు గెలుపొందాయి. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు.

Last Updated : Jun 2, 2023, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.