ETV Bharat / bharat

కాలకృత్యాలకు వెళ్లిన బాలిక​పై హత్యాచారం! - మలవిసర్జన కోసం వెళ్లిన మైనర్​పై హత్యాచారం

కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయటకు వెళ్లిన బాలికపై కిరాతుకులెవరో హత్యాచారానికి పాల్పడ్డారు. కర్ణాటకలో ఈ అమానవీయ ఘటన జరిగింది.

minor rape in karnataka
కర్ణాటకలో మైనర్​పై హత్యాచారం
author img

By

Published : Jul 24, 2021, 12:32 PM IST

Updated : Jul 24, 2021, 12:39 PM IST

కర్ణాటక చిత్రదుర్గలో దారుణం జరిగింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయటకు వెళ్లిన ఓ బాలికపై.. హత్యాచారం జరిగింది.

ఏం జరిగింది?

చిత్రదుర్గ జిల్లాలోని ఓ గ్రామంలో నివసించే బాలిక కుటుంబం.. తమ ఇంటి నిర్మాణం జరుగుతున్నందున ఓ కమ్యూనిటీ భవనంలో నివసిస్తోంది. దాంతో ఆరుబయటే మరుగుదొడ్డి అవసరాలను తీర్చుకుంటోంది. ఈ క్రమంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన బాలిక.. ఎంతకూ తిరిగి రాలేదు. దాంతో తల్లిదండ్రులు వెతకగా.. వారికి ఓ మొక్కజొన్న తోటలో బాలిక మృతదేహం నగ్నంగా కనిపించిందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై గాట్లు ఉన్నాయని చెప్పారు. సమీపంలో ఉన్న ఓ నీటిగుంటలో బాలిక చెప్పులు కనిపించాయని వెల్లడించారు.

దీనిపై బ్రహ్మసాగర పోలీసులు.. అత్యాచారం, హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: 'మహా' విషాదం: రెండు రోజుల్లో 136 మంది మృతి

ఇదీ చూడండి: వరదలో చిక్కుకున్న నిండు గర్భిణీని కాపాడిన ఎన్డీఆర్​ఎఫ్

Last Updated : Jul 24, 2021, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.