రెండోసారి కరోనా బారిన పడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప వైరస్ నుంచి కోలుకున్నారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన.. ఇంటికి చేరుకున్నారు.

సీఎంకు మార్చి 16న కరోనా సోకడం వల్ల ఆసుపత్రిలో చేరారు. 78 ఏళ్ల యడియూరప్ప.. గతేడాది ఆగస్టులో మొదటిసారి వైరస్ బారినపడి కోలుకున్నారు.

కర్ణాటకలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉండగా.. రోజుకు 10వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి.
ఇదీ చదవండి:'మోదీజీ ప్రసంగాలు కాదు.. పరిష్కారం చెప్పండి'