ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చే నాటక సన్నివేశంలో అపశృతి తలెత్తింది. చాముండేశ్వరీ పాత్ర ధరించిన ఓ వ్యక్తి.. ఆ పాత్రలోకి లీనమై రాక్షస (మహీషుడు) పాత్రలోని వ్యక్తిపై ఏకంగా హత్యయత్నానికి పాల్పడ్డాడు. కర్ణాటకలోని మాండ్య కళామందిర్లో ఈ నెల 6న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
డ్రామాలో భాగంగా కౌండాలికా సన్నివేశంలో చాముండీ పాత్రలోని వ్యక్తి మహీషుడిపై దాడి చేసి, హతమార్చేందుకు ప్రయత్నించాడు. అయితే.. వెంటనే నిర్వహకులు అడ్డుకోవడం వల్ల.. ప్రమాదం తప్పినట్టయింది.
ఇదీ చదవండి: బాపూ.. చూస్తున్నావా నీ దేశాన్ని!