కర్ణాటకలో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. కేబినెట్లో చోటు దక్కించుకున్న 29 మంది ఎమ్మెల్యేలు.. గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా ఎవరినీ ఎంపిక చేయలేదు.


అనుభవజ్ఞులు, యువకుల కలబోతతో కొత్త కేబినెట్‌ను రూపొందించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఏడుగురు ఓబీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఏడుగురు ఒక్కలిగలు, 8 మంది లింగాయత్‌లు, ఓ ఎస్టీ, ఓ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించిందని వివరించారు. ఓ మహిళను సైతం కేబినెట్లోకి తీసుకున్నట్లు చెప్పారు. పాలనను మెరుగుపర్చడం సహా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు నడ్డా మార్గనిర్దేశనంతో కేబినెట్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.


యడ్డీ కుమారుడికి నో
అయితే, కేబినెట్ కూర్పులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు నిరాశే మిగిలింది. యడ్డీ కుమారుడికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించినా అలా జరగలేదు.
ఇవీ చదవండి: