ETV Bharat / bharat

కిలో కొర్రలు లెక్కించి.. వరల్డ్​ రికార్డ్​ - గోధుమ గింజలను లెక్కించి

ఒక కిలోకు ఎన్ని కొర్రలు ఉంటాయో మీకు తెలుసా..? చెప్పటం అసాధ్యం కదా.. కానీ కర్ణాటకకు చెందిన అభిషేక్​ మాత్రం 87 గంటల్లో ఒక కిలో కొర్రలను లెక్కించి ఇండియాస్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు సాధించాడు.

World Records through counting millets
గోధుమ గింజలు లెక్కించి రికార్డ్​
author img

By

Published : Jul 4, 2021, 4:33 PM IST

Updated : Jul 4, 2021, 7:51 PM IST

కిలో కొర్రలు లెక్కించి.. వరల్డ్​ రికార్డ్​

ఒక కిలోకు ఎన్ని కొర్రలు ఉంటాయో చెప్పటం సామాన్యులకు దాదాపు అసాధ్యం. కానీ ఆ పనిని సుసాధ్యం చేసి చూపాడు కర్ణాటకకు చెందిన అభిషేక్​. 87 గంటల 35 నిమిషాల్లో కిలో కొర్రలను లెక్కించి రికార్డు నెలకొల్పాడు. మొత్తం 4లక్షల 4వేల 882 కొర్రలను లెక్కించి ప్రఖ్యాత ఇండియాస్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించాడు.

World Records through counting millets
ఐడబ్ల్యూఎఫ్ ప్రశంస పత్రం
World Records through counting millets
అవార్డులతో అభిషేక్
World Records through counting millets
ఐడబ్ల్యూఎఫ్ ప్రశంస పత్రం

ఈ ఘనత సాధించేందుకు మొత్తం 87 గంటల 35 నిమిషాలు కష్టపడ్డాడు అభిషేక్. ప్రతి 500 కొర్రలను ఒక ప్యాకెట్​గా చేశాడు. ఇండియా వరల్డ్ రికార్డ్స్​ యాజమాన్యం సమక్షంలోనే ఈ పని పూర్తి చేశాడు.

World Records through counting millets
అవార్డు, ప్రశంస పత్రాలతో అభిషేక్
World Records through counting millets
కొర్రలను లెక్కిస్తూ..

లాక్​డౌన్​లో..

కర్ణాటక శివమొగ్గ.. అశోక్​ రోడ్​కు చెందిన అభిషేక్​.. ప్రస్తుతం బీబీఏ చదువుతున్నాడు. లాక్​డౌన్​ సమయాన్ని సద్వినియోగం చేసుకుని.. చేతికి సరిగా దొరకని కొర్రలను లెక్కించటం సాధన చేశాడు.

World Records through counting millets
కొర్రలను శ్రద్ధగా లెక్కిస్తున్న అభిషేక్
World Records through counting millets
కుటుంబ సభ్యులతో అభిషేక్

అభిషేక్​ సాధించిన విజయంపై అతడి​ తల్లిదండ్రులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.

గతంలోనూ..

గతంలోనూ కర్ణాటకకు చెందిన సచిన్ అనే యువకుడు కిలో రాగి గింజలను లెక్కించి.. ఇండియా వరల్డ్​ రికార్డ్స్​లో చోటు సాధించాడు. 146 గంటల 30 నిమిషాల్లో మొత్తం కిలోకు 3,76,083 రాగి విత్తనాలు ఉన్నట్లు గుర్తించాడు సచిన్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి కిలో రాగి గింజలు లెక్కపెట్టి.. రికార్డు కొల్లగొట్టి...

ఇదీ చదవండి : మాజీ భార్యే సవతి తల్లి అయిందని తెలిస్తే...

Last Updated : Jul 4, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.