ETV Bharat / bharat

గుడిలో రథయాత్రకు ముందు ఖురాన్ పఠనంపై దుమారం.. అయినా..

Belur temple: కర్ణాటకలోని ఓ ఆలయంలో రథయాత్రకు ముందు ఖురాన్ చదవడంపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీనిపై స్పందించిన ఆలయ పరిపాలకులు సంప్రదాయం ప్రకారమే ఇలా చేశామని, అధికారుల అనుమతి కూడా తీసుకున్నామని స్పష్టం చేశారు. రథోత్సవంలో ఖురాన్ పఠించడం దశాబ్దాలుగా వస్తున్న ఆచారమన్నారు.

Belur temple
ఆలయంలో రథయాత్రకు ముందు ఖురాన్ పఠనం
author img

By

Published : Apr 15, 2022, 7:10 PM IST

Quran recitation in temple: కర్ణాటక హాసన్ జిల్లా బెలూర్​లోని చెన్నకేశవ స్వామి ఆలయంలో జరిగే రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఏటా ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారు. ఈ సారి వేడుకలు బుధవారం జరిగాయి. అయితే రథయాత్రకు ముందు ఖరాన్​ చదవడంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

Belur temple
ఆలయంలో రథయాత్రకు ముందు ఖురాన్ పఠనం

దీనిపై స్పందించిన ఆలయ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ ఆలయంలో రథయాత్రకు ముందు ఖురాన్ చదవడం దశాబ్దాలుగా ఉన్న ఆచారమని, దాన్ని దృష్టిలో ఉంచుకునే రిలీజియస్​ ఎండోమెంట్స్ కమిషనర్​కు లేఖ రాసి అనుమతి తీసుకున్నట్లు చెప్పారు. ఆలయ పరిపాలకుడు విక్రమాదిత్య ఈ మేరకు వివరణ ఇచ్చారు. కమిషనర్​ రోహిణి సింధూరి ఇందుకు అనుమతి ఇచ్చిన్నట్లు చెప్పారు. హిందూ మత చట్టం 2002లోని సెక్షన్ 508 ప్రకారం దేవాలయాలు, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోలేమని లేఖకు ప్రతిస్పందనలో రోహిణి చెప్పినట్లు పేర్కొన్నారు. అందుకే ఎప్పటిలాగే ఈసారి కూడా రథం కదలాడానికి ముందు బుధవారం ఉదయం 10:40 గంటలకు ముస్లిం మతపెద్ద ఖాజీ సాబ్​..​ ఖురాన్​ను పఠించినట్లు చెప్పారు.

Belur temple
ఆలయంలో రథయాత్రకు ముందు ఖురాన్ పఠనం

Karnataka temple Quran: ఏటా రథోత్సవానికి ముందు ఖురాన్ చదవడం సాధారణమేనని, కానీ ఈసారి కొందరి నుంచి అభ్యంతరాలు రావడం వల్లే ప్రత్యేకంగా లేఖ రాసి అనుమతి తీసుకోవాల్సి వచ్చిందని ఆలయ అధికారులు వివరించారు. ఈసారి ఆలయం వద్ద జరిగే తిరునాళ్లలో ముస్లిం కుటుంబాలు షాపులు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వొద్దని హిందూ సంస్థలకు చెందిన కొందరు కలెక్టర్​, తహసీల్దార్​, ఆలయ పరిపాలకులకు లేఖలు కూడా రాశారు. కానీ చివరకు 15 ముస్లిం కుటుంబాలకు తిరునాళ్లలో దుకాణాలు పెట్టుకునేందుకు అవకాశం దక్కింది.

Belur temple
ఆలయంలో రథయాత్రకు ముందు ఖురాన్ పఠనం

Karnataka Belur Temple: ఈసారి రోథత్సవంలో కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్​కుమార్​ అభిమానులు హంగామా చేశారు. ఆయన ఫొటోలు, కన్నడ జెండాలు పట్టుకుని 'అప్పు.. అప్పు..' అనే నినాదాలతో ఆలయ ప్రాంగాణాన్ని హోరెత్తించారు. కర్ణాటకలో ఇప్పటికే హిజాబ్ వివాదం చెలరేగిన నేపథ్యంలో రథోత్సవంలో ఖురాన్ చదవడానికి అనుమతి ఇవ్వొద్దని హిందూ సంస్థలు అధికారులను కోరాయి. కానీ వారు సంప్రదాయానికే పెద్దపీట వేశారు.

ఇదీ చదవండి: గుజరాత్​లోనూ 'బుల్​డోజర్ ట్రెండ్'​.. నిందితుడి ఆస్తులు ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.