ETV Bharat / bharat

గజరాజుకు కన్నీటి వీడ్కోలు- విలపించిన ఊరు

ఎప్పుడో ఏళ్ల క్రితం ఆ ఊరి గుడికి వచ్చింది ఓ ఏనుగు. దాని సందడి చూస్తూ.. ఘీంకార నాదాలు వింటూ అక్కడి పిల్లలు పెరిగారు. ఊరిలో ఏ వేడుకైనా ఆ గజరాజు లేకుండా వాళ్లు జరుపుకునేవారు కాదు. అలాంటి ఆ ఏనుగు కన్నుమూయగా.. ఆ గ్రామస్థులు కన్నీటిపర్యంతం అయ్యారు. గజరాజుకు తుది వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చారు.

elephant dies in temple
ఆలయంలో ఏనుగు మృతి
author img

By

Published : Nov 16, 2021, 11:46 AM IST

గజరాజు మృతి

ఆలయంలో ఉండే ఏనుగుతో ఆ గ్రామస్థులది విడదీయరాని బంధం. తమ ఊరిలో జరిగే ఎన్నో వేడుకల్లో ఆ గజరాజును వాళ్లు భాగం చేసుకున్నారు. తమ కుటుంబంలో ఒకరిగా భావించారు. అలాంటి ఆ ఏనుగు మరణించిన వార్త తెలుకుని.. ఆ గ్రామస్థులు బోరున విలపించారు.

కర్ణాటక బెల్గాం జిల్లా(karnataka belgaum district news) చిప్పలికట్టి గ్రామంలోని మహాలక్ష్మి ఆలయంలో 'సుధ' అనే 60 ఏళ్ల వయసు ఉన్న ఆడ ఏనుగు.. ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉంటోంది. ఆలయంలో జరిగే ఎన్నో ఉత్సవాల్లో ఆ ఏనుగు పాల్గొంది. వృద్ధాప్యంతో పాటు, కాలికి గాయం కాగా.. సుధ ఇటీవల అనారోగ్యం బారిన పడింది. నెలరోజులుగా చికిత్స పొందుతున్న ఆ ఏనుగు పరిస్థితి విషమించి, సోమవారం కన్నుమూసింది.

elephant dies in temple
మృతి చెందిన ఏనుగు సుధ
elephant dies in temple
ఏనుగు మృతదేహం వద్ద గ్రామస్థుల రోదనలు
elephant dies in temple
గజరాజు వద్ద విలపిస్తున్న గ్రామస్థులు
elephant dies in temple
'సుధ'కు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన జనం

1975లో 'సుధ'ను మహాలక్ష్మి దేవాలయానికి తీసుకువచ్చారు. వివిధ రాష్ట్రాల్లో జరిగే అనేక కార్యక్రమాల్లోనూ ఈ ఏనుగు పాల్గొంది. 'సుధ' మరణవార్త విని గ్రామస్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. చిప్పలికట్టి సమీప గ్రామాల్లోని ప్రజలు కూడా ఆ ఏనుగును కడసారి చూసేందుకు తరలి వచ్చారు. రామదుర్గ ఎమ్మెల్యే మహాదేవప్ప యదవాడా, బెళగావి జిల్లా కలెక్టర్​ సహా ఇతర అధికారులు కూడా వచ్చి ఏనుగుకు తుది వీడ్కోలు పలికారు.

ఇవీ చూడండి:

ఆ ఏనుగుకు కన్నడ పవర్ స్టార్ 'పునీత్' పేరు

సరదాగా అడవిలోకి ఎస్పీ దంపతులు- ఒక్కసారిగా ఏనుగుల దాడితో..

చెరకు కర్ర కోసం హైవేపై ఏనుగుల ఫైట్​- భారీగా ట్రాఫిక్​ జామ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.