ETV Bharat / bharat

కొత్త ఇంటికి మోదీ పేరు పెట్టిన వీరాభిమాని - channagiri modi home

Modi house: కొత్తగా నిర్మించిన ఇంటికి ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టాడు కర్ణాటకకు చెందిన వీరాభిమాని. ఇంటి ద్వారం వద్ద మోదీ చిత్రాపటాన్ని కూడా ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నాడు. చూడముచ్చటగా ఉన్న ఈ ఇల్లు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

A Fan Named His Newly built House As 'Shri Narendra Modi Nilaya'
కొత్త ఇంటికి మోదీ పేరు పెట్టిన వీరాభిమాని
author img

By

Published : Apr 29, 2022, 12:30 PM IST

Modi fan home: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కోట్లాదిమంది అభిమానులు ఉంటారు. తమ అభిమానాన్ని ఎన్నోసార్లు వివిధ రూపాల్లో వ్యక్తపరిచారు. కొందరు మోదీలా గెడ్డం పెంచి ఆయనను అనుసరిస్తే, మరికొందరు ఆయనలా వేషధారణ చేసి మోదీ జాకెట్లు ధరిస్తారు. కర్ణాటక దావణగెరె జిల్లాలోని చన్నగిరికి చెందిన గౌడర హాలేశ్​ కూడా ప్రధానికి విరాభిమాని. అయితే ఆయన ఏకంగా తన ఇంటికి మోదీ పేరు పెట్టారు. తన కూతురు కోసం నిర్మించిన కొత్త ఇల్లుకు 'శ్రీ నరేంద్ర మోదీ నిలయం' అని నామకరణం చేశారు. చూడముచ్చటగా ఉన్న ఈ అందమైన ఇళ్లు ద్వారం వద్ద మోదీ చిత్రాపటాన్ని కూడా ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

A Fan Named His Newly built House As 'Shri Narendra Modi Nilaya'
కొత్త ఇంటికి మోదీ పేరు పెట్టిన వీరాభిమాని

Modi Fan Karnatka: చన్నగిరిలోని కగటూరు రోడ్డులో నిర్మించిన ఈ ఇల్లును చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా తరలివస్తున్నారు. మొదట ఈ ఇంటికి సహ్యాద్రి లేదా శివాజి పేరు పెట్టాలనుకున్నానని, కానీ మోదీపై అభిమానంతో ఆయన పేరే పెట్టానని హాలేశ్ చెప్పారు. గృహప్రవేశ కార్యక్రమం మే 3న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులను కూడా ఆహ్వానిస్తానని తెలిపారు.

ఇదీ చదవండి: కాలిపోయిన కొత్త బస్సులు.. కండక్టర్​ సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.