ETV Bharat / bharat

నుపుర్‌ శర్మకు కంగన మద్దతు.. ఇది అఫ్గానిస్థాన్ కాదంటూ...

NUPUR SHARMA KANGANA RANAUT: వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలకు గురవుతున్న భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ అండగా నిలిచారు. నుపుర్​తో పాటు ఆమె కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు రావడాన్ని ఖండించారు. భౌతిక హాని తలపెట్టడం తగదని కంగనా పేర్కొన్నారు.

KANGANA RANAUT NUPUR SHARMA
NUPUR SHARMA STATEMENT
author img

By

Published : Jun 8, 2022, 7:23 AM IST

Updated : Jun 8, 2022, 11:03 AM IST

NUPUR SHARMA KANGANA RANAUT: మహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలతో అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు గురవుతున్న భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మకు సినీ నటి కంగనా రనౌత్‌ మద్దతు పలికారు. అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఆమెకు ఉందంటూ సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. నుపుర్‌ శర్మ, ఆమె కుటుంబాన్ని హతమార్చుతామంటూ బెదిరింపులు రావడాన్ని కంగన ఖండించారు. టీవీ ఛానెల్‌ చర్చలో నుపుర్‌ చేసిన వ్యాఖ్యలతో విభేదించేవారు ఆమెకు వ్యతిరేకంగా చట్టబద్ధమైన చర్యలను ఆశ్రయించాలని సూచించారు.

భౌతిక హాని తలపెట్టడం తగదని కంగన పేర్కొన్నారు. 'ఇది అఫ్గానిస్థాన్‌ కాదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పనిచేసే ప్రభుత్వం ఇక్కడ ఉందని మరచిపోవద్దు' అని పోస్ట్ చేశారు. నుపుర్‌ శర్మ ఫిర్యాదు మేరకు ఆమెకు, ఆమె కుటుంబానికి భద్రత కల్పించినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించిన కొన్ని గంటల వ్యవధిలోనే రనౌత్‌ ఈ ప్రకటన చేశారు.
NUPUR SHARMA STATEMENT: మరోవైపు, నుపుర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉంది. వీరి వ్యాఖ్యలను ఖండిస్తూ ఇస్లామిక్‌ దేశాలన్నీ ప్రకటనలు చేస్తున్నాయి. ఇప్పటికే డజను ముస్లిం దేశాలు ఈ అంశంపై తీవ్రంగా స్పందించగా మంగళవారం ఇరాక్‌, లిబియా, మలేసియా, తుర్కియే(టర్కీ)లతో పాటు ఈజిప్ట్‌లోని అరబ్‌ పార్లమెంటు నిరసన తెలిపాయి.

ఇదీ చదవండి:

Last Updated : Jun 8, 2022, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.