ETV Bharat / bharat

'తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు'

అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాలతో తమిళనాడు ప్రజలు విసుగు చెందారని మక్కల్​ నీది మయ్యం అధినేత, నటుడు కమల్​ హాసన్​ అన్నారు. ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారని, తన పార్టీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ​అన్నాడీఎంకే, డీఎంకేలపై విమర్శలు గుప్పించారు.

People in TN yearning for change: Kamal Haasan
'తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు'
author img

By

Published : Jan 4, 2021, 10:08 PM IST

Updated : Jan 4, 2021, 10:36 PM IST

తమిళనాడు తన పార్టీకి క్రమంగా మద్దతు పెరుగుతోందని.. అవినీతి విధానాలను అవలంబించే పార్టీలకు ఇది నచ్చట్లేదని మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచార వేగం పెంచారు. దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ నినాదం 'నాలై నమధే' (రేపటి రోజు మనదే) అనే నినాదాన్ని కమల్​ ఉటంకించారు. ఎంజీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తే.. అన్నాడీఎంకే, డీఎంకేలు అవినీతికి అగ్ర తాంబూలం ఇస్తున్నాయని ఆరోపించారు. ప్రజలే మార్పునకు నాంది పలకాలన్నారు.

మహిళల మద్దతు..

అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తనకు మహిళలు మద్దతుగా నిలుస్తున్నారని.. తన సభలకు వారు పెద్దఎత్తున తరలిరావడం ఎన్నికల విజయంపై నమ్మకాన్నిస్తోందని కమల్ అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని ఆరోపించారు. ఈ పరిస్థతి మారాల్సిన అవసరం ఉందని.. ఎన్నికలను చరిత్రాత్మక అవకాశంగా భావించి తన పార్టీని ఆదరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

అదే తేడా..

ఇప్పటివరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదరికాన్ని పెంచి పోషిస్తే.. తాను మాత్రం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడతానని కమల్​ చెప్పారు. అదే తనకు, ఇతర పార్టీలకు ఉన్న తేడా అని వివరించారు. రాబోయే ఎన్నికల్లో తన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజల అండతో రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు.. తమిళ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెడతానని ఉద్ఘాటించారు. వాతావరణ పరిరక్షణతో పాటు.. జలసంపద సంరక్షణ ఎంఎన్ఎం అజెండాగా ప్రకటించారు.

తన పార్టీకి బలమైన వ్యూహాలున్నాయని.. రాష్ట్రంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యమని కమల్​ తెలిపారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఏఐఏడీఎంకే ప్రభుత్వం సంక్రాతి కానుక అని చెబుతూ ప్రజలకు రూ.2500, బియ్యం, చక్కెర ఇస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి: 'మా తమ్ముడు సీఎం కావడం అసాధ్యం'

Last Updated : Jan 4, 2021, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.