ETV Bharat / bharat

ఈ నెల 13 నుంచి కమల్​ ఎన్నికల ప్రచారం - మక్కల్​ నీది మయ్యం

తమిళనాడులో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారాస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నారు మక్కల్​ నీది మయ్యం అధ్యక్షుడు కమల్​ హాసన్. ఈ నెల 13 నుంచి 16 వరకు తొలి దశ ప్రచారం చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Kamal Haasan to launch election campaign on December 13
ఈ నెల 13 నుంచి కమల్​ ఎన్నికల ప్రచారం ప్రారంభం
author img

By

Published : Dec 11, 2020, 12:23 PM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈనెల 13న ప్రచార శంఖం పూరించనున్నారు మక్కల్​ నీది మయ్యం(ఎంఎన్​ఎం) అధినేత కమల్​ హాసన్. ఈ మేరకు పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్​ ఆర్​ మహేంద్రన్​ ఓ ప్రకటనలో తెలిపారు.

డిసెంబర్​ 13 నుంచి 16 వరకు కమల్​ తొలి దశ ప్రచారం చేయనున్నారని వెల్లడించారు మహేంద్రన్​. అందులో భాగంగా.. మధురై, తేని, దిండిగల్​, విరుధునగర్, తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి​ జిల్లాల్లో పర్యటించనున్నట్టు చెప్పారు.

2018 ఫిబ్రవరిలో ఎంఎన్​ఎం​ను ప్రారంభించారు కమల్. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క పార్లమెంట్​ సీటును కూడా గెలవలేకపోయింది.

ఇవీ చదవండి:

ఎన్నికల కోసం రజనీ మద్దతు కోరనున్న కమల్

'తమిళనాట అన్ని స్థానాల్లో రజనీ పార్టీ పోటీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.