ETV Bharat / bharat

ఆ 'ఘటన'తో కల్యాణ్​ సింగ్​ రాజకీయ ప్రస్థానం మలుపు! - యూపీ సీఎం కల్యాణ్ సింగ్

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్​ సింగ్​ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. యూపీలో భాజపా సత్తా చాటేందుకు ఎనలేని కృషి చేశారు. అయితే.. 1992లో జరిగిన బాబ్రీ మసీదు ఘటన.. ఆయనను సీఎం పదవికి దూరం చేసింది.

kalyan singh
కల్యాణ్ సింగ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి
author img

By

Published : Aug 21, 2021, 10:36 PM IST

దేశ రాజకీయాల్లో కల్యాణ్​ సింగ్​కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఉత్తర్​ప్రదేశ్​ రాజకీయాలపై తనదైన ముద్రవేశారు కల్యాణ్​ సింగ్​. కీలకమైన ఉత్తర్​ప్రదేశ్​ను భాజపా వశం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించి గౌరవించింది కమలదళం. ఇంతటి కీర్తి పొందిన ఆయన తీవ్ర అనారోగ్యం కారణంగా శనివారం రాత్రి మరణించారు. అయితే కల్యాణ్​ సింగ్​ అనగానే అందరికి గుర్తొచ్చే విషయం.. 'బాబ్రీ మసీదు' ఘటన!

సీఎంగా ఉన్న సమయంలో..

ఎందరో నేతల వ్యూహాల కారణంగా 1992లో అయోధ్య రామ మందిర ఉద్యమం ఊపందుకుంది. వీరిలో కల్యాణ్​ సింగ్​ ఒకరు! 1992, డిసెంబర్​ 6న.. వేల మంది కర సేవకులు అయోధ్యలో సమావేశమైన సమయంలో.. కల్యాణ్​ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మసీదు ఘటన యావత్​ దేశంలో సంచలనం సృష్టించింది. ఆ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు కల్యాణ్​ సింగ్​. అయితే సీఎం పదవి కోల్పోయినప్పటికీ, నాడు జరిగిన ఘటనపై తాను గర్వపడుతున్నానని అనేకమార్లు పేర్కొన్నారు కల్యాణ్​సింగ్​. ఈ ధైర్యమే.. ఆయన్ని రాముడికి 'అపర భక్తుడి'గా, రామ మందిర నిర్మాణం ఉద్యమంలో 'హీరో'గా మార్చింది.

ఆ ఘటన భాజపాకు అనేక విధాలుగా ఉపయోగపడింది. జాతీయ స్థాయిలో రాజకీయంగా లబ్ధిపొందింది. ఈ సెంటిమెంట్​తోనే హిందువులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పట్టుసాధించి కేంద్రంలో అధికారం సొంతం చేసుకుంది. అటు ఉద్యమంలో వ్యవహరించిన నేతలు కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇదీ చదవండి:'అయోధ్యలో రామ మందిరం చూడటం నా కల'

ఆ రోజు...

డిసెంబర్​ 6న.. అయోధ్యలోని బాబ్రీ మసీదు ప్రాంగణంలో వేల మంది కరసేవకులు గుమిగూడిన తరుణంలో ఫరీదాబాద్ జిల్లా కలెక్టర్(నేటి అయోధ్య) ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కాల్పులు జరిపైనా కరసేవకులను అదుపు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే.. ఈ కాల్పుల నేపథ్యంలో అయోధ్య ప్రాంతం రక్తసిక్తమవుతుందని కూడా లేఖలో పేర్కొన్నారు. దాదాపు 4 లక్షల మంది కర సేవకులు సాకేత్​ మహావిద్యాలయ ప్రాంతంలో సమావేశమైనట్లు స్పష్టం చేసి.. కాల్పులు జరపాలా? వద్దా? అనే దానిపై ఆదేశాలివ్వమన్నారు.

ఈ లేఖను నాటి ప్రధాన కార్యదర్శి.. ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్​కు అందజేసినట్లు సీనియర్ పాత్రికేయులు పీఎన్ ద్వివేది తెలిపారు. అయితే.. కరసేవకులను నియంత్రించడానికి కాల్పులు జరపకాకుండా ఇతర మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు సింగ్.

సీఎం ఆదేశాల మేరకు పోలీసులు ఎలాంటి కాల్పులు జరపలేదు. కరసేవకులను శాంతియుతంగా అదుపు చేయాలని విశ్వప్రయత్నం చేశారు. కానీ అధికారుల ప్రయత్నం విఫలమైంది. అనంతరం జరిగిన పరిణామాలతో రాజీనామా చేశారు కల్యాణ్​ సింగ్​.

ఇదీ చదవండి:బాబ్రీ కేసులో కల్యాణ్​సింగ్​కు ఊరట- బెయిల్​ మంజూరు

'హిందువుల కోసం..'

'1528లో నాటి ముఘల్​ చక్రవర్తి బాబర్ కమాండర్ మిర్​ బాకీ దండయాత్ర చేసి రామ మందిరాన్ని కూల్చివేశారు. ఆ ప్రాంతంలో బాబ్రీ మసీదును నిర్మించారు. ఇది ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం కాదు, కోట్ల మంది హిందువులను అవమానించడానికే,' అని కళ్యాణ్​ సింగ్ ఆరోపించారు. బాబ్రీ మసీదు ఘటన అనంతరం ప్రభుత్వం గద్దె దిగినప్పటికీ, రామ మందిర నిర్మాణానికి బలమైన పునాది పడినట్టు చెబుతూ ఉంటారు.

'జీవితంలోనే కీలక ఘట్టం'

అయోధ్య భూమి పూజ కార్యక్రమాన్ని వీక్షించడం తన జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం అని సింగ్​ స్వయంగా చెప్పారు. ఈ విషయాన్ని పాత్రికేయులు ద్వివేది తెలిపారు. 2020, ఆగస్టు 5న.. రామమందిన నిర్మాణ శంకుస్థాపనకు కళ్యాణ్​ సింగ్ హాజరయ్యారు.

"ఈరోజు నా కల నెరవేరింది. ఇది నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనేది నా చిరకాల కోరిక. మొత్తానికి ఆ కోరిక నేరవేరింది."

--కల్యాణ్ సింగ్, ఉత్తర్​ప్రదేశ్​ మాజీ సీఎం.

ఆ నివేదికలో..

బాబ్రీ ఘటనపై దర్యాప్తు జరిపిన లిబర్హన్ కమిషన్​.. కల్యాణ్​ సింగ్​ను దోషిగా పేర్కొంటూ ఓ నివేదికను విడుదల చేసింది. అయితే.. అది తప్పుడు నివేదిక అని దాన్ని చెత్తబుట్టలో పడేయాలని సింగ్ ఆరోపించారు. కాల్పులకు ఆదేశించకుండా శాంతియుతంగానే పరిస్థితిని అదుపుచేయాలని ఆదేశించినట్టు గుర్తుచేశారు. రామ భక్తులైన కర సేవకుల ప్రాణాలు తీసి పాపం మూటగట్టుకోవడం తనకు ఇష్టం లేదని వివరించారు. ఈ క్రమంలో.. మసీదు ఘటన వెనుక కుట్ర దాగి ఉందన్న ఆరోపణలను కొట్టిపారేశారు.

ఇదీ చదవండి:'కరసేవకులపై కాల్పులకు ఆదేశాలు ఇవ్వనందుకు గర్వపడుతున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.