KP Chowdhary arrested in Drugs Case : కొకైన్ విక్రయిస్తూ కబాలి సినిమా నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి.. అలియాస్ కేపీ చౌదరి పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి 82.75 గ్రాముల కొకైన్, ఒక కారు, రూ.2.05 లక్షల నగదు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేపీ చౌదరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.78 లక్షల విలువ ఉంటుందని వెల్లడించారు. మరొ నిందితుడు నైజీరియాకి చెందిన పేటిట్ ఎజుబర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఖమ్మం జిల్లా బోనకల్‌కి చెందిన కేపీ చౌదరి.. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మహారాష్ట్రలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ నిర్వహణ సంచలకుడిగా పని చేశాడు. అనంతరం ఉద్యోగం మానేసి 2016లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కేపీ చౌదరి.. రజనీ కాంత్ నటించిన కబాలీ సినిమా తెలుగులో నిర్మాతగా వ్యవహరించాడు. దీంతో పాటు పలు తెలుగు, తమిళం సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు.
Kabali Film Producer arrested in Drug Case : ఈ క్రమంలోనే అనుకున్నంత లాభాలు రాకపోవడంతో డ్రగ్స్ దందాలోకి దిగాడు. ఇందుకోసం గోవాలో ఓహెచ్ఏం పేరుతో పబ్‌ను ప్రారంభించాడు. అక్కడికి హైదరబాద్ నుంచి వచ్చే స్నేహితులకు, సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేశాడు. ఆ వ్యాపారంలో కూడా నష్టాలు రావడంతో ఏప్రిల్‌లో తిరిగి హైదరాబాద్‌కి వచ్చాడు. గొవా నుంచి వచ్చే ముందు పెటిట్ యేజుబర్ అనే నైజీరియన్ నుంచి.. 100ప్యాకెట్ల కొకైన్ తెచ్చాడు. వాటిలో కొన్నింటిని తాను వినియోగించాడు. గత రాత్రి కిస్మత్పూర్ క్రాస్ రోడ్డు వద్ద విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా.. మాదాపూర్ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. కేపీ చౌదరి జాబితాలో మరి కొంతమంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని వారు భావిస్తున్నారు.
Police Seized Drugs in Hyderabad : ఇటీవల బెంగళూరు నుంచి హైదరాబాద్ డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లిలో విక్రయిస్తుండగా... ఇద్దరు వ్యక్తుల ముఠాను కూకట్పల్లి పోలీసులు పట్టకున్నారు. షహబాజ్ ఖాన్, యూసుఫ్ షరీఫ్, బెంగళూరులో బట్టల దుకాణంలో సేల్స్ మెన్‌గా పనిచేసి జీవనం సాగించేవారని పోలీసులు తెలిపారు. అయితే చేస్తున్న పని నుంచి వచ్చే ఆదాయం సరిపోక సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్నారని వివరించారు.
ఈ క్రమంలోనే నిందితులు బెంగళూరు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి అమ్మకాలు చేసేవారని పోలీసులు తెలిపారు. వీరిద్దరు కూకట్పల్లి వై జంక్షన్ ప్రాంతంలో ఉదయం 8 గంటల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చిందని చెప్పారు. దీంతో వారిని తనిఖీ చేయగా డ్రగ్స్ లభ్యమైనట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 2లక్షల 20వేల రూపాయలు విలువ చేసే 22.9 గ్రాముల నిషేదిత డ్రగ్ ఎండీఎంఏతో పాటు, మూడు సెల్ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: Choutuppal Police Seized Drugs : గోవా టు హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా.. కీలక నిందితుడి అరెస్ట్
ముంబయి ముఠాలు యువతులకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నాయి: సీవీ ఆనంద్