ETV Bharat / bharat

సీజేఐగా జస్టిస్ ఎన్​.వి.​ రమణ- రాష్ట్రపతి ఆమోదం - జస్టిస్​ రమణ

భారత దేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ఎన్​వీ రమణ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆయన నియామకానికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదం తెలిపారు. ప్రస్తుత సీజేఐ ఎస్​ఏ బోబ్డే పదవీకాలం ఈ నెల 23న ముగుస్తుండగా.. 24న సీజేఐగా జస్టిస్​ రమణ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

justice-nv-ramana-to-be-the-next-cji
సీజేఐగా జస్టిస్​ రమణ- రాష్ట్రపతి ఆమోదం
author img

By

Published : Apr 6, 2021, 10:49 AM IST

Updated : Apr 6, 2021, 11:27 AM IST

భారత దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్​వీ రమణ నియామకం ఖరారైంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే ప్రతిపాదనకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఈమేరకు ఆమోద ముద్ర వేశారు.

justice-nv-ramana-to-be-the-next-cji
నోటిఫికేషన్​

ఏప్రిల్​ 24న ప్రమాణం...

జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా జస్టిస్ రమణను నియమించాలని జస్టిస్ బోబ్డే ఇటీవల కేంద్రానికి సిఫార్సు చేశారు. కేంద్ర న్యాయశాఖ, హోంశాఖ పరిశీలన తర్వాత ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి చేరింది. కోవింద్ ఆమోదంతో సీజేఐ ఎంపిక పూర్తయింది.
ఏప్రిల్‌ 24న సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరిస్తారు. 2022 ఆగస్టు 26 వరకు 16 నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు.

జస్టిస్ రమణ నేపథ్యం

1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో జస్టిస్ రమణ జన్మించారు. 1983 ఫిబ్రవరిలో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.

Last Updated : Apr 6, 2021, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.