ETV Bharat / bharat

జస్టిస్ ఇందు మల్హోత్రా సేవలు ప్రశంసనీయం: సీజేఐ - బార్ అసోసియేషన్​

సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ ఇందు మల్హోత్రా శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆవరణలో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్.ఎ.బోబ్డే.. న్యాయ వ్యవస్థకు జస్టిస్​ మల్హోత్ర చేసిన సేవలను కొనియాడారు.

Justice Indu Malhotra emotional on last court day, CJI extols her role
జస్టిస్ ఇందు మల్హోత్రా సేవలు ప్రశంసనీయం: సీజేఐ
author img

By

Published : Mar 13, 2021, 8:02 AM IST

ఒక మహిళా న్యాయవాది నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడం చరిత్రాత్మకమని, అటువంటి అరుదైన గౌరవాన్ని జస్టిస్​ ఇందు మల్హోత్ర సొంతం చేసుకున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.ఎ.బోబ్డే అన్నారు. ఆమె తీర్పులు న్యాయ పరిజ్ఞానంతో తొణికిసలాడుతుంటాయని తెలిపారు. జస్టిస్​ ఇందు మల్హోత్ర శనివారం పదవీ విరమణ చేయనున్న సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టులో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జస్టిస్​ ఎస్.ఎ బోబ్డే, జస్టిస్​ ఎ.ఎస్.బోపన్న ఆమెతో పాటు ధర్మాసనంలో ఆసీనులయ్యారు.

2007లో సీనియర్​ న్యాయవాది హోదాను పొందిన ఇందు మల్హోత్ర 2018 ఏప్రిల్​ 26న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పదవీ విరమణ నేపథ్యంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. బార్ అసోసియేషన్​ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన జస్టిస్​ ఇందు మల్హోత్ర.. ''నా శక్తిమేరకు న్యాయ వ్యవస్థకు సేవలందించిన సంతృప్తితోనే పదవీ విరమణ చేస్తున్నా'' అని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: 'వృద్ధుల చికిత్సకు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే'

'మహిళ ఆస్తిపై తండ్రి వారసులకూ హక్కు'

'ఆ కేసు విచారణ నుంచి తప్పించుకోవాలని చూడొద్దు'

యువర్​ ఆనర్​ అనొద్దు: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.