గుజరాత్లోని జునాగఢ్ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు ఓ వ్యక్తికి అరుదైన ఆపరేషన్ చేశారు. అతని పొట్ట నుంచి 62 చెక్క ముక్కలు, 15 ప్లాస్టిక్ స్ట్రాలు, 2 హెన్నా కోన్లను తొలగించారు. డాక్టర్లు ఆ వ్యక్తి పొట్టలో అన్ని వ్యర్థాలు ఉండడాన్ని చూసి నిర్ఘాంతపోయారు. మతిస్థిమితం లేక, బాధను బయటకు చెప్పుకోలేక కొన్నేళ్లుగా నరకం చూస్తున్న అతడికి కొత్త జీవితాన్ని అందించారు.
డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ వీరావల్లోని మాల్దా ప్రాంతానికి చెందిన.. 40 ఏళ్ల అర్జున్ చంద్పాకు పుట్టుకతోనే మతిస్థిమితం లేదు. గత కొన్నిరోజులుగా అతను పొట్ట నొప్పితో బాధ పడుతూ జునాగఢ్ ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అతనికి సీటీ స్కాన్ చేసి పొట్టలో 79 వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ఆ యువకుడికి ప్రాణహాని జరగకముందే వెంటనే సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు గంటలపాటు ఆపరేషన్ చేసి ఆ వ్యక్తి పొట్టలో నుంచి 62 చెక్కముక్కలు, 15 ప్లాస్టిక్ స్ట్రాలు, 2 హెన్నా కోన్లు తొలగించారు. ఈ వ్యర్థాలన్నీ పొట్టలో గడ్డకట్టి ఉన్నాయి.
"అర్జున్.. గత 3 సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడి ఉంటాడు. చెవిటి, మూగవాడు కావడం వల్ల ఎవరికీ చెప్పలేకపోయాడు. ఈ ఆపరేషన్ ద్వారా అతనికి కొత్త జీవితాన్ని అందించాము. జునాగఢ్ ఆస్పత్రి చరిత్రలోనే ఇటువంటి కేసును మొదటి సారిగా చూస్తున్నాము" అని డాక్టర్ మినేష్ సింఘాల్, ఈటీవీ భారత్కు చెప్పారు.
ఇవీ చదవండి : దేశంలో ఎక్కడున్నా ఆ బడిలో చేరొచ్చు.. తొలి వర్చువల్ స్కూల్ ప్రారంభం
'మా వర్గం అమ్మాయితో మాట్లాడతావా?'.. యువకుడ్ని చితకబాదిన క్లాస్మేట్స్