దేశవ్యాప్తంగా టీకాల కొరతను ఉద్దేశించి కేంద్రంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. "జులై పోయింది.. వ్యాక్సిన్ల కొరత తీరలేదు" అంటూ హిందీలో ట్వీట్ చేసిన రాహుల్.. దీనికి 'టీకాలు ఎక్కడ' అని హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు.
గత నెల 2న సైతం ఇలాగే ట్వీట్ చేశారు రాహుల్. "జులై వచ్చింది. వ్యాక్సిన్లు రాలేదు" అని రాహుల్ గతంలో పేర్కొన్నారు.
కాగా, గత నెల 28న రాహుల్ టీకా తీసుకున్నట్లు పార్టీలు వర్గాలు తెలిపాయి. అందుకే 29, 30 తేదీల్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రాహుల్ హాజరుకాలేదని పేర్కొన్నాయి. ఏప్రిల్ 20న రాహుల్ కరోనా బారిన పడటం వల్ల వ్యాక్సిన్ తీసుకోవడంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది.
రాహుల్ జీ.. మీరూ టీకా వేసుకున్నారట కదా?
దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెలలో మరింత వేగవంతం కానుందని తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా. ప్రభుత్వ వ్యాక్సిన్ కార్యక్రమంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు.
-
"Over 13 crores doses have been administered in July, in the country.... I've heard, you are one of those 13 crores people who have been vaccinated in July": Union Health Minister Mansukh Mandaviya's response to Congress leader Rahul Gandhi over COVID vaccination pic.twitter.com/ZzE3Vyo8ku
— ANI (@ANI) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">"Over 13 crores doses have been administered in July, in the country.... I've heard, you are one of those 13 crores people who have been vaccinated in July": Union Health Minister Mansukh Mandaviya's response to Congress leader Rahul Gandhi over COVID vaccination pic.twitter.com/ZzE3Vyo8ku
— ANI (@ANI) August 1, 2021"Over 13 crores doses have been administered in July, in the country.... I've heard, you are one of those 13 crores people who have been vaccinated in July": Union Health Minister Mansukh Mandaviya's response to Congress leader Rahul Gandhi over COVID vaccination pic.twitter.com/ZzE3Vyo8ku
— ANI (@ANI) August 1, 2021
"జులైలో 13 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశాం. ఈ నెలలో మరింత వేగవంతం కానుంది. జులైలో వ్యాక్సిన్ తీసుకున్న 13 కోట్ల మందిలో మీరూ ఒకరని విన్నాను. కానీ, మన శాస్త్రవేత్తల గూరించి మీరు ఒక్కమాట మాట్లాడలేదు. కనీసం ప్రజలు టీకా తీసుకోవాలని కోరలేదు. వ్యాక్సిన్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. టీకాల కొరత కాదు, మీలో పరిపక్వత లేదు."
- మాన్సుక్ మాండవియా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.
ఇదీ చూడండి: ఈ నెల 5న పెగసస్ వ్యవహారంపై సుప్రీం విచారణ