ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
బంధుమిత్రలతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర ధన్య లాభాలున్నాయి. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. సూర్య స్తుతి శుభప్రదం.
ఇష్టకార్య సిద్ధి ఉంది. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. మాట విలువను కాపాడుకోవాలి. ధనధాన్య లాభాలుంటాయి. అవసరానికి ఆదుకునేవారుంటారు. ఇష్టదైవారాధన మంచినిస్తుంది.
మీ మీ రంగాల్లో మధ్యమ ఫలితాలున్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. తోటి వారి సాయంతో కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. మనశ్శాంతి కోల్పోకుండా చూసుకోవాలి. శివాష్టోత్తరాన్ని పఠిస్తే మంచిది.
చేపట్టే పనులు విజయాన్నిస్తాయి. బంధుప్రీతి ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మంచినిస్తుంది.
శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. బలమైన ప్రయత్నంతో ధనలాభం ఉంది. దుర్గ శ్లోకం చదవండి.
కృషికి తగ్గ ఫలితలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. నూతన కార్యాలు ఫలిస్తాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.
చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడక పోవచ్చును. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపం కలిగిస్తుంది. దైవారాధనను ఎలాంటి పరిస్థితులలోనూ మానవద్దు.
శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.
మంచి ఫలితాలున్నాయి. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. లక్ష్మీగణపతి ధ్యానం శుభప్రదం.
ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. హనుమాన్ చాలీసా జపించడం మంచిది.
మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఈశ్వరుని ఆరాధిస్తే మంచిది.