ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
![](https://assets.eenadu.net/article_img/mesham_2.jpg)
చేపట్టే పనుల్లో శ్రమ పడకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో మీరు మాటపడాల్సి వస్తుంది. సహనం కోల్పోరాదు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. చంద్రధ్యానం శుభప్రదం.
30 Second Coca Cola Commercial
![](https://assets.eenadu.net/article_img/vrushabam.jpg)
ముఖ్య పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. దుర్గాదేవి దర్శనం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
![](https://assets.eenadu.net/article_img/midhunam.jpg)
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
![](https://assets.eenadu.net/article_img/karkatakam_2.jpg)
మెరుగైన ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపు పూర్తి కావొస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.
![](https://assets.eenadu.net/article_img/simham_1.jpg)
శుభకాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన మంచిది.
![](https://assets.eenadu.net/article_img/kanya_1.jpg)
ఆత్మన్యూనతా భావాన్ని దరిచేరనీయకండి. తోటివారితో కలుపుకొనిపోవాలి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/tula_1.jpg)
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.
![](https://assets.eenadu.net/article_img/vruschikam.jpg)
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో మోసాలు రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రుల సహకారం తీసుకోవడం మంచిది. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/dhanussu.jpg)
చేసే పనిలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. రవిధ్యాన శ్లోకం చదివితే మేలు.
![](https://assets.eenadu.net/article_img/makaram_3.jpg)
గ్రహబలం బాగుంది. మీకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/kumbam_1.jpg)
చేపట్టిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికారచనకు ఇది సరైన సమయం. సౌభాగ్యసిద్ధి కలదు. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. ఆంజనేయ ఆరాధన శుభాన్ని ఇస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/meenam_2.jpg)
మంచి పనులు చేయడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. లక్ష్మీస్తోత్రం చదివితే మంచిది.