ETV Bharat / bharat

రైతు ఆవిష్కరణ.. రూ.25వేలకే ట్రాక్టర్!​

రైతులకు సాగు చేసేందుకు ట్రాక్టర్​ ఎంతో కీలకం. దానిని కొనుగోలు చేయాలంటే కనీసం రెండు లక్షలకుపైగా ఖర్చు చేయాలి. అయితే ట్రాక్టర్​ కొనే స్తోమత లేని ఓ రైతు తనే సొంతంగా ఓ పరిష్కారాన్ని కనుగొన్నాడు. కేవలం రూ.25వేలకే ఓ మినీ ట్రాక్టర్​ను రూపొందించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్​లోని విదిశా జిల్లాలో జరిగింది.

mini tractor madhya pradesh, మినీ ట్రాక్టర్​ నిర్మించిన రైతు
మినీ ట్రాక్టర్​తో రైతు విజయ్​ సింగ్​
author img

By

Published : Jun 12, 2021, 6:18 PM IST

Updated : Jun 12, 2021, 7:20 PM IST

మినీ ట్రాక్టర్​తో రైతు విజయ్​ సింగ్​

లక్షల్లో విలువ ట్రాక్టర్​ను కొనే స్తోమత లేని రైతులు.. సాగుకు మరో ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. అయితే మధ్యప్రదేశ్​ విదిశా జిల్లా ఘట్​వాయీ గ్రామానికి చెందిన విజయ్​ సింగ్​ రఘువంశీ అనే రైతు భిన్నంగా ఆలోచించాడు. ఆటో ఇంజిన్​తో ఓ మినీ ట్రాక్టర్​ను రూపొందించాడు. ఇందుకు అతనికి అయిన ఖర్చు కేవలం రూ. 25వేలు.

తయారీ ఇలా..

పాడైపోయిన ఆటో నుంచి ఇంజిన్​ కొనుగోలు చేసిన విజయ్​ సింగ్​.. దానిని స్థానిక మెకానిక్​తో బాగుచేయించాడు. తానే సొంతంగా ట్రాక్టర్ బాడీ​ రూపకల్పన చేశాడు. ఇంజిన్​ అమర్చి, బాడీకి మూడు చక్రాలు బిగించి మినీ ట్రాక్టర్​ను సిద్ధం చేశాడు. ఈ కొత్త యంత్రంతో విజయ్​కు.. తన 1.5 ఎకరాల భూమిలో సాగు సులభం అవుతోంది. దీని​తో 3 గంటల్లో పావు ఎకరాన్ని దున్నవచ్చు. ఇందుకు కేవలం ఒకటిన్నర లీటర్ల డీజిల్​ అవసరం అవుతుందని విజయ్​ సింగ్​ వెల్లడించాడు.

గ్యాస్​తోనూ..

ఈ మినీ ట్రాక్టర్​ను గ్యాస్​తో కూడా నడిచే విధంగా విజయ్​ సింగ్​ ఏర్పాటు చేశాడు. 5హెచ్​పీ డీజిల్​ ఇంజిన్​ను స్టార్ట్​ చేశాక గ్యాస్​తో నడిచే విధంగా మార్చుకోవచ్చని విజయ్​ సింగ్​ తెలిపాడు. 14 లీటర్ల గ్యాస్​తో 58 నుంచి 62 గంటల పాటు ఇంజిన్​ పనిచేస్తుందని వెల్లడించాడు.

ఇతర ఆవిష్కరణలు..

సొంతంగా యంత్రాలను కనిపెట్టడం విజయ్​ సింగ్​కు కొత్తేం కాదు. అంతకుముందు నాలుగు వేలు ఖర్చు చేసి సొంతంగా ఎలక్ట్రిక్​ ఫెన్సింగ్​ తయారు చేశాడు. దీని ద్వారా జంతువులకు ఎలాంటి హాని కలగదని కేవలం చిన్న షాక్​ తగులుతుందని విజయ్​ తెలిపాడు.

ఇదీ చదవండి : 93ఏళ్ల కొవిడ్ రోగికి 'సర్​ప్రైజ్'

Last Updated : Jun 12, 2021, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.