ETV Bharat / bharat

రాష్ట్రపతి ఎన్నికలపై వ్యూహం.. భాజపా కీలక నేతలతో నడ్డా భేటీ - భాజపా కార్యవర్గ సమావేశం

JP NADDA NEWS: రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేంద్రమంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

jp nadda news
జేపీ నడ్డా మీటింగ్
author img

By

Published : Jun 19, 2022, 10:50 PM IST

JP NADDA NEWS: రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సమన్వయ కమిటీతో భేటీ అయ్యారు. 14 మంది సభ్యులున్న ఈ కమిటీ కన్వీనర్ గజేంద్ర షెకావత్​ సహా పార్టీ ప్రధాన కార్యదర్శులు సీటీ రవి, వినోద్ తవాడే, కేంద్రమంత్రులు జీ కిషన్​ రెడ్డి, అర్జున్​ మేఘ్​వల్​ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధనే లక్ష్యంగా అధికార ఎన్​డీఏలోని భాగస్వామ్యపక్షాలు, విపక్ష పార్టీలతో చర్చించే బాధ్యతను భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​కు కొన్ని రోజుల క్రితం పార్టీ అప్పగించింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, నేషనల్​ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాతో సహా పలువురు ప్రతిపక్ష నాయకులను నడ్డా, రాజ్​నాథ్ సింగ్ కలిశారు.

జులై 18న తేదీన రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నట్లు, జూలై 21న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నట్లు కొద్ది రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుత రాష్ట్రపతిగా ఉన్న రామ్​నాథ్​ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 24తో పూర్తవనుంది. తగిన సంఖ్యా బలం ఉండడం వల్ల ఎన్​డీఏ అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికల్లో సులువుగా గెలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి: ' భాజపా ఆఫీస్ సెక్యూరిటీ గార్డులుగా అగ్నివీర్​లకే ప్రాధాన్యం'

అగ్నిపథ్​పై కాంగ్రెస్ సత్యాగ్రహం- ప్రభుత్వాన్ని కూల్చే కుట్రన్న భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.