ETV Bharat / bharat

మోదీ- జాన్సన్​​ వర్చువల్ భేటీ.. పదేళ్ల రోడ్​మ్యాప్​ విడుదల

భారత్, బ్రిటన్​ ప్రధానులు నరేంద్ర మోదీ, బోరిస్​ జాన్సన్ వర్చువల్​గా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఒక బిలియన్ పౌండ్ల ఒప్పందానికి పరస్పర అంగీకారం తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగా ఎదిగేందుకు పదేళ్ల రోడ్​మ్యాప్​ను ప్రకటించారు.

Johnson  virtual summit with Modi
మోదీ-బోరిస్​
author img

By

Published : May 4, 2021, 9:03 PM IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్ వర్చువల్​గా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తూ, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగా అవతరించేందుకు అవసరమైన పదేళ్ల రోడ్​మ్యాప్​ను విడుదల చేశారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారం మరింత పెంచుకునేందుకు అంగీకారం తెలిపారు.

సమావేశంలో భాగంగా రెండు దేశాల మధ్య బిలియన్​ పౌండ్లు విలువ చేసే భారీ వాణిజ్యం ఒప్పందానికి మోదీ, బోరిస్​ అంగీకరించారు. ఇది అతిపెద్ద ప్రకటన అని భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.

భారత్​తో బిలియన్​ డాలర్ల ఒప్పందంతో తమ దేశంలో 6500 ఉద్యోగాలు సృష్టించవచ్చని బ్రిటన్​ ప్రధాని అన్నారు. భేటీ అనతరం ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ ఒప్పందంలో జీబీపీ 533 మిలియన్లు.. భారత్​ నుంచి బ్రిటన్​కు పెట్టుబడిగా వెళతాయి. ఆరోగ్యం, సాంకేతిక రంగాల్లో ఈ పెట్టుబడులు ఉండనున్నాయి. ఇందులో జీబీపీ 240 మిలియన్లు.. సీరం సంస్థ బ్రిటన్​లో పెట్టుబడిగా పెట్టనుంది.

నీరవ్​, మాల్యా అంశంపై..

దేశం వీడి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్​ మాల్యా, నీరవ్​ మోదీలను భారత్​కు అప్పగించే విషయంపైనా బోరిస్​తో మోదీ చర్చించారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. వారిని విచారణ నిమిత్తం వీలైనంత త్వరగా భారత్​కు పంపాలని కోరినట్లు పేర్కొంది.

బోరిస్​ గత నెలాఖరులో భారత్​లో పర్యటించాల్సి ఉంది. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా రద్దు చేసుకున్నారు. ఈ కారణంగానే గణతంత్ర వేడుకల్లోనూ పాల్గొనలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.