ETV Bharat / bharat

11 సార్లు కొవిడ్​ సోకిన వ్యక్తికి ప్రికాషన్ డోసు - బూస్టర్​ డోసు తీసుకున్న మహేశ్​ చందానీ

11 సార్లు కరోనా బారిన పడిన మహేశ్​ ఉత్తమ్​ చందానీ అనే ఓ వ్యక్తి సోమవారం ప్రికాషన్ డోసు తీసుకున్నారు. అర్హులైనవారంతా మూడో డోసు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

precaution dose
ప్రికాషన్ డోసు
author img

By

Published : Jan 10, 2022, 10:04 PM IST

ఒమిక్రాన్​ విజృంభిస్తున్న నేపథ్యంలో రాజస్థాన్​ ప్రభుత్వం ఫ్రంట్​ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ప్రికాషన్ డోసును పంపిణీ చేయడాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో పదకొండు సార్లు కరోనా బారిన పడిన మహేశ్​ ఉత్తమ్​ చందానీ అనే వ్యక్తి ప్రికాషన్ డోసును తీసుకున్నారు. జోధ్​పుర్​లోని ఓ టీకా పంపిణీ కేంద్రంలో మూడో డోసు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

precaution dose mahesh uttam chandani
ప్రికాషన్ డోసు తీసుకున్న మహేశ్​ ఉత్తమ్​ చందానీ

"నేను ఇప్పటి వరకు 11 సార్లు వైరస్​ బారిన పడ్డాను. 40 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నాను. ప్రికాషన్​ డోస్​ వేస్తున్నారు అని తెలియగానే పరుగున వచ్చాను. నా వంతు బాధ్యతగా మూడో డోసు తీసుకున్నాను. అర్హులు అందరూ కూడా నాలానే బూస్టర్​ డోసు తీసుకోవాలని కోరుతున్నాను. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ప్రికాషన్​ డోసు తీసుకునేందుకు ముందుకు రావాలి."

-మహేశ్​ ఉత్తమ్​ చందానీ, 11 సార్లు కొవిడ్​ బారిన పడిన వ్యక్తి

మహేశ్​ ఉత్తమ్​ చందానీ, అతని కుటుంబం టర్కీలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. భారత్​కు తిరిగి వస్తుండగా.. ఆయన కొవిడ్​ బారిన పడ్డారు. ఆ తరువాత అతని కుటుంబ సభ్యులకు కూడా వైరస్​ సోకింది. 2020లో జోధ్​పుర్​లో వెలుగు చూసిన తొలి కరోనా కేసు మహేశ్​దే కావడం గమనార్హం.

మరోవైపు, జోధ్​పుర్​ కలెక్టర్​ ఇంద్రజీత్​ సింగ్​, సీఎంఓ డాక్టర్​ బల్వంత్​ మందతో పాటు పలువురు ప్రికాషన్​ డోసును తీసుకున్నారు.

ఇదీ చూడండి: వైద్య సిబ్బంది 'టీకా' సాహసం- భారీ హిమపాతంలోనూ విధులకు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.