మహారాష్ట్ర మలాద్కు చెందిన దంపతులు కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కార్మికుల కడుపు నింపుతున్నారు. కరోనా ఆంక్షలతో రూపాయి ఆదాయం లేకపోయినా.. వేల మంది పేదలకు ఆహారం, నిత్యావసర సరుకులు అందిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఉపాధి లేకపోయినా..

మహారాష్ట్ర, మలాద్లోని అంబోజ్వాడీ ప్రాంతానికి చెందిన ఫయాజ్ షేక్, మిజ్గా దంపతులు. ఫయాజ్ షేక్.. ఓ సుగంధ ద్రవ్యాల సంస్థలో పనిచేసేవారు. కరోనా సంక్షోభం కారణంగా గతేడాది అతని ఉద్యోగం పోయింది. ఆ తర్వాత ఫయాజ్ తన ఇంటినిర్మాణం కోసం ప్రావిడెంట్ ఫండ్లో దాచుకున్న రూ. 5 లక్షలను.. పేదలు, వలసకార్మికుల ఆకలి తీర్చేందుకు ఖర్చుచేస్తున్నారు.
నిత్యావసర సరుకులు సైతం..
అంబోజ్వాడీ ప్రాంతంలో దాదాపు 2వేల మంది పేదలు, వలసకార్మికులకు ఆహారంతో పాటు ఇంటికే నిత్యావసర సరుకులు అందించి వారికి అండగా నిలుస్తున్నారు.
సామూహిక వంటశాలను ఏర్పాటు చేసి.. కష్ట కాలంలో ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి : ఆపత్కాలంలోనూ రాజకీయాలేనా.. విచక్షణ ఏది?