ETV Bharat / bharat

IBPS​లో సూపర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్ష జీతం!

Job Openings: ఐబీపీఎస్​లో నెలకు రూ.లక్ష వేతనంతో ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తుకు మే 31 చివరి తేది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు..​

job-opening
ఐబీపీఎస్​లో ఉద్యోగాలు
author img

By

Published : May 23, 2022, 3:40 PM IST

IBPS jobs: రీసెర్చ్​ అసోసియేట్ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇనిస్టిట్యూట్​ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్​ సెలక్షన్​(ఐబీపీఎస్​). ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.12 లక్షల వరకు ఉంటుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • ఈ​ పోస్టుకు ఎంపికైన వారు ముంబయిలోని ఐబీపీఎస్ కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. నెల జీతం రూ.44,900. ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కలుపుకొంటే మొత్తం రూ.లక్ష వరకు అవుతుంది. దీంతో వార్షిక వేతనం దాదాపు రూ.12 లక్షల వరకు ఉంటుంది.
  • ఈ పోస్టు పట్ల ఆసక్తిగల వారు www.ibps.in వైబ్​సైట్లోకి లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలి
  • దరఖాస్తుకు చివరి తేది మే 31. జూన్​లో రాత పరీక్ష ఉంటుంది.
  • దరఖాస్తు రుసుం రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత గ్రూప్​ టెస్టు, వ్యక్తిగత ఇంటర్వ్యూ పూర్తయ్యాక తుది జాబితా వెల్లడిస్తారు.
  • అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్లకు మించకూడదు.
  • సైకాలజీ/ఎడ్యుకేషన్​/ సైకాలాజికల్​ మెజర్​మెంట్​/ సైకోమెట్రిక్ మేనేజ్​మెంట్​లో(హెచ్​ఆర్ స్పెషలైజేషన్​) పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కనీసం 55శాతం మార్కులు సాధించి ఉండాలి.
  • అకాడెమిక్ రీసెర్చ్​/ టెస్టు డెవలప్​మెంట్​లో కనీసం ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

ఇదీ చదవండి: బీటెక్​తో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. జీతం రూ.2 లక్షలకుపైనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.