ETV Bharat / bharat

'ముఫ్తీని మేం గృహ నిర్బంధం చేయలేదు' - పీడీపీ అధినేత్రి, మెహబూబా ముఫ్తీ

విలేకరుల సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించిన పీడీపీ అధినేత్రి మెహబూబూ ముఫ్తీని పోలీసులు అడ్డుకున్నారు. అయితే.. ఆమెను తాము గృహ నిర్బంధం చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. పీడీపీ నేత వహీద్​ పర్రా కుటుంబ సభ్యులను సందర్శించడాన్ని వాయిదా వేయాలని మాత్రమే తాము సూచించామని చెప్పారు.

JK Police disallow press conference at Mehbooba Mufti's residence, deny claims of house arrest
'ముఫ్తీని మేం గృహ నిర్బంధం చేయలేదు'
author img

By

Published : Nov 27, 2020, 8:25 PM IST

జమ్ముకశ్మీర్​ రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. తనను, తన కుమార్తె ఇల్తీజాను గృహనిర్బంధం చేశారన్న ముఫ్తీ వాదనను పోలీసులు ఖండించారు. వారిని తాము హౌస్​ అరెస్ట్​ చేయలేదని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా తన సందర్శనను వాయిదా వేయాలని మాత్రమే సూచించామని చెప్పారు.

అంతకుముందు.. గుప్కార్​ ప్రాంతంలోని ఫెయిర్​వ్యూ నివాసంలో ముఫ్తీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆమె నివాసానికి 100 మీటర్ల దూరంలోనే పాత్రికేయులను కట్టడి చేశారు. అయితే.. తమ పైఅధికారుల ఆదేశాలతోనే విలేకరులతో మాట్లాడేందుకు ముఫ్తీని అనుమతించలేదని పోలీసులు తెలిపారు. దీనిపై మెహబూబా ముఫ్తీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కశ్మీర్ ఒక బహిరంగ జైలు అని ట్విట్టర్​ వేదికగా ధ్వజమెత్తారు.

  • Im going to hold a press conference at 3:00 pm today & will brief the press on various issues. Request media to kindly come.

    — Mehbooba Mufti (@MehboobaMufti) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"శ్రీనగర్​లోని నా నివాసంలోకి రాకుండా అధికారులు అడ్డుకున్నారు. ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు లేనప్పటికీ నన్ను నిర్బంధించారు. కశ్మీర్ ఒక బహిరంగ జైలు, ఇక్కడ ఎవరికీ తమ అభిప్రాయాన్ని తెలియజేసే హక్కు లేదు.

-- మెహబూబా ముఫ్తీ,పీడీపీ అధినేత్రి

జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల ప్రారంభానికి ఒక రోజు ముందు.. ప్రతిపక్షాలను ప్రభుత్వం గందరగోళానికి గురి చేస్తోందని ముఫ్తీ అన్నారు. బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

అంతకుముందు.. తనను, తన కుమార్తె ఇల్తీజాను మరోసారి గృహ నిర్బంధం చేశారని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. పుల్వామాలోని వహీద్​ పర్రా​ కుటుంబాన్ని కలిసేందుకు.. రెండురోజులుగా తమకు అనుమతినివ్వడం లేదని చెప్పారు. వహీద్​ పర్రాను నిరాధార ఆరోపణలతో ఎన్​ఐఏ అరెస్టు చేసిందని ఆమె వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:మరోసారి ముఫ్తీ, ఇల్తీజా గృహ నిర్బంధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.