హిమపాతం, పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన కారణంగా మూడో రోజూ జమ్ముకశ్మీర్ జాతీయ రహదారిని అధికారులు మూసి ఉంచారు. జమ్ముకశ్మీర్‌లోని బనిహాల్, రామ్‌బన్ ప్రాంతాల మధ్యలో కొండ చరియలు విరిగిపడిన కారణంగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు.
గాంగ్రో, షెర్బీ బీ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. సీపీపీఎల్ అనే రోడ్డు నిర్మాణ కంపెనీ రహదారిపై పడిన కొండ చరియల్ని తొలగిస్తోంది.
హిమాచల్ ప్రదేశ్‌లోనూ..
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో హిమపాతం, వర్షం కారణంగా 10 రోడ్లు దెబ్బతిన్నాయి. లోయలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
ఇదీ చదవండి: జమ్ములో భారీ హిమపాతం-రాకపోకలకు అంతరాయం