ETV Bharat / bharat

మెహబూబా ముఫ్తీ తల్లికీ పాసుపోర్టు తిరస్కరణ - jammu kashmir police about mahabooba mufti

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాతృమూర్తి గుల్షన్​ నాజిర్​ పాసు​పోర్టు కోసం చేసిన దరఖాస్తు తిరస్కరణకు గురైంది. ​ పోలీసులు ఇచ్చిన ప్రతికూల నివేదిక వల్ల ఆమె పాసుపోర్టును అధికారులు తిరస్కరించారు.

mahabooba mufti
మెహబూబా ముఫ్తీ తల్లికీ పాసుపోర్టు తిరస్కరణ
author img

By

Published : Mar 31, 2021, 5:23 AM IST

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాతృమూర్తి గుల్షన్​ నాజిర్​ పాసు​పోర్టు కోసం దాఖలు చేసిన దరఖాస్తు తిరస్కరణకు గురయింది. మక్కా సందర్శనకు వెళ్లాల్సి ఉందంటూ గత ఏడాది డిసెంబరులో ఆమె ఈ దరఖాస్తు చేసుకున్నారు. జమ్ముకశ్మీర్​ పోలీస్​ విభాగం ఇచ్చిన ప్రతికూల నివేదిక వల్ల పాస్​పోర్ట్​ జారీ చేయలేకపోతున్నామని ప్రాంతీయ పాస్​పోర్టు కార్యాలయ అధికారులు ఒక లేఖ ద్వారా గుల్షన్​ నాజిర్​కు తెలియజేశారు. పాస్​పోర్టు చట్టంలోని సెక్షన్​ 6(2)కి దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

మెహబూబా ముఫ్తీ పాస్​పోర్టు దరఖాస్తు కూడా ఇదే కారణాలతో అధికారులు తిరస్కరించారు. విదేశాల్లో భారతదేశ వ్యతిరేక ప్రచారం, దేశ సమగ్రతను దెబ్బతీసే వ్యక్తులకు పాస్​పోర్టును నిరాకరించే అధికారం చట్టంలోని నిబంధనల ప్రకారం అధికారులకు ఉంటుంది.

ఇదీ చూడండి:దిల్లీ ఆస్పత్రులలో కరోనా రోగులకు పడకలు రిజర్వ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.