ETV Bharat / bharat

బతికుండగానే కూతురికి అంత్యక్రియలు - ఝార్ఖండ్​ తాజా వార్తలు

తమ మాట వినకుండా వేరే వ్యక్తిని వివాహం చేసుకుందని కూతురిపై కోపం పెంచుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఎంత నచ్చజెప్పినా అతన్ని వదిలి తమ వద్దకు రావట్లేదని బతికుండగానే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Woman punished with 'last rites' ritual
బంతికుండగానే కూతురికి అంత్యక్రియలు
author img

By

Published : Mar 31, 2021, 8:53 PM IST

తాము చెప్పిన వ్యక్తితో వివాహానికి నిరాకరించడమే కాకుండా.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్నకూతురు బతికుండగానే అంత్యక్రియలు నిర్వహించారు తల్లితండ్రులు. ఈ అమానుష ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. సమీప బంధువైన రాజ్‌దీప్ కుమార్‌తో గత రెండేళ్లుగా తమ కూతురు సహజీవనం చేస్తోందని.. నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారు. ఎంత చెప్పినా వినకపోవడ వల్ల ఆగ్రహించి ఆమె అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు.

కూతురు వివాహాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం కూతురు బొమ్మ తయారు చేసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆచారాల ప్రకారం బొమ్మకు దహన సంస్కారాలు పూర్తి చేశారు.

ఝార్ఖండ్‌ ఛత్రా జిల్లా తాండవ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే సుఖ్​దేవ్​ రామ్ కుమార్తె సబితా అలియాస్ కిరణ్ కుమారి (25) నాలుగు నెలల క్రితం సమీప బంధువైన రాజ్‌దీప్ కుమార్‌ను వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదని వారు తెలిపారు.

నా కూతురికి మంచి కుటుంబంలోని ఓ వ్యక్తితో నిశ్చితార్థం చేశాం. వివాహానికి పూర్తి స్థాయిలో సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఇలా చేసింది. ఆమె మా పరువు తీసేలా ప్రవర్తించింది.

-మహిళ తండ్రి

ఇవీ చదవండి: ఆ రాష్ట్ర మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం

ఇష్రత్​ జహాన్​ కేసులో పోలీసులకు ఊరట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.