ETV Bharat / bharat

మృత్యువుతో ఎమ్మెల్యే పోరాటం.. ఇంతలోనే కుమారుడి ఆత్మహత్య!

ఝార్ఖండ్ సిందరీ భాజపా ఎమ్మెల్యే ఇంద్రజీత్ మహతో కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఎమ్మెల్యే అనారోగ్యంతో హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Jharkhand MLA son suicide
Jharkhand MLA son suicide
author img

By

Published : Feb 13, 2023, 8:50 PM IST

ఝార్ఖండ్ సిందరీ భాజపా ఎమ్మెల్యే ఇంద్రజీత్ మహతో ఇంట విషాదం నెలకొంది. ఓ వైపు ఎమ్మెల్యే అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా.. ఆయన కుమారుడు వివేక్ కుమార్​ మహతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దిల్లీ ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వివేక్​.. కొద్ది రోజుల కిందటే రాంచీ సమీపంలోని సిల్లీలో ఉన్న స్నేహితుడి దగ్గరికి వచ్చాడు.

వివేక్ కుమార్ మహతో ఆదివారం ఉదయం పురుగుల మందు తాగాడు. వెంటనే మురిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడం వల్ల రాంచీలోని మరో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వివేక్​ డిప్రెషన్​తోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా వివేక్ కుమార్ మహతో తండ్రి.. సిందరీ ఎమ్మెల్యే అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కట్నం కోసం ఏడు నెలల గర్బిణి హత్య
మహారాష్ట్ర పాల్ఘర్​లో దారుణం జరిగింది. కట్నం కోసం ఏడు నెలల గర్భిణిని హత్య చేశారు కుటుంబ సభ్యులు. అనంతరం ఆమె ఉరి వేసుకుని అత్మహత్య చేసుకుందని నమ్మించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్తను అదుపులోకి తీసుకున్నారు.

కమ్గర్​ చౌల్​కు చెందిన కన్హయ్యలాల్​కు ఏడాది క్రితం రోషిణితో వివాహం జరిగింది. కట్నంగా రూ.5 లక్షలు, ఓ మోటార్​ సైకిల్​ డిమాండ్ చేశాడు. రోషిణి తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడం వల్ల బంగారు గొలుసు, ఉంగరం, రూ. 50,000 ఇచ్చారు. అప్పటినుంచి రోషిణికి అత్తవారింట్లో వేధింపులు మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామున తన సోదరికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించిందని.. ఆ తర్వాత కొద్దిసేపటికే రోషిణి శవమై కనిపించింది. తనను వేధిస్తున్నారని శనివారమే ఫోన్​ చేసి చెప్పిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.