ఝార్ఖండ్‌లో శుక్రవారం అర్ధరాత్రి రైల్వే ట్రాక్‌లపై(Maoists attack in Jharkhand) బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు దుండగులు. ధన్‌బాద్ జిల్లాలో రైల్వే ట్రాక్‌ని పేల్చివేశారు. దీంతో అటుగా వస్తున్న రైలు పట్టాలు తప్పింది. లాతెహార్, పశ్చిమ సింహబూమ్ జిల్లాల్లోనూ రైల్వేట్రాక్‌లపై బాంబుదాడులు జరిగాయి. దీంతో బార్కాకానా- గర్హా, హవఢా- ముంబయి రైళ్లకు అంతరాయం ఏర్పడింది.

మావోయిస్టు అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా అరెస్టుపై శనివారం మావోయిస్టులు దేశవ్వాప్త బంద్ ప్రకటించారు. ఈ క్రమంలో మావోయిస్టులే ఈ దాడులకు పాల్పడ్డారని (Naxalites blow up railway track) పోలీసులు తెలిపారు.


ప్రస్తుతం ఆ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ల మరమ్మతు పనులు చేపడుతున్నారు.