Jhansi railway station new name: ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజులుగా ప్రముఖ ప్రాంతాలు, రైల్వే స్టేషన్ల పేర్లు మార్చుతోంది. తాజాగా మరో రైల్వే స్టేషన్ పేరును మార్చేసింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్. రాణి లక్ష్మీబాయి స్మారకార్థం.. ఝాన్సీ రైల్వే స్టేషన్‌ను వీరాంగణ లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌గా మార్చింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ముఖ్యమంత్రి యోగి.
-
उत्तर प्रदेश का 'झाँसी रेलवे स्टेशन' अब 'वीरांगना लक्ष्मीबाई रेलवे स्टेशन' के नाम से जाना जाएगा।
— Yogi Adityanath (@myogiadityanath) December 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">उत्तर प्रदेश का 'झाँसी रेलवे स्टेशन' अब 'वीरांगना लक्ष्मीबाई रेलवे स्टेशन' के नाम से जाना जाएगा।
— Yogi Adityanath (@myogiadityanath) December 29, 2021उत्तर प्रदेश का 'झाँसी रेलवे स्टेशन' अब 'वीरांगना लक्ष्मीबाई रेलवे स्टेशन' के नाम से जाना जाएगा।
— Yogi Adityanath (@myogiadityanath) December 29, 2021
పేరు మార్చుతున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. " 2021, నవంబర్ 24న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎలాంటి అభ్యంతరం లేదని లేఖ రాసిన క్రమంలో స్టేషన్ పేరును మార్చుతున్నాం." అని పేర్కొంది. ఈ క్రమంలో మార్పులు చేసేందుకు ప్రక్రియ మొదలు పెట్టినట్లు చెప్పారు నార్త్ సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్ఓ శివమ్ శర్మ.
గతంలో రెండు..
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేర్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంతకు ముందు ముఖల్సరాయ్ రైల్వే స్టేషన్ పేరును దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్‌గా, ఫైజబాద్ రైల్వే స్టేషన్ పేరును అయోధ్య జంక్షన్‌గా మార్చింది. అలాగే.. ఫైజబాద్, అలహాబాద్ జిల్లాల పేర్లను అయోధ్య, ప్రయాగ్రాజ్లుగా మార్చేసింది.
ఇదీ చూడండి: