కేరళ తిరువనంతపురంలో ఓ నగల వ్యాపారి కళ్లలో కారం చల్లి దాదాపు 800 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు. వ్యాపారి కారును ముందూ.. వెనకా వెంబడించిన దొంగల ముఠా.. పళ్లిపురంలోని టెక్నో పార్కు వద్దకు రాగానే అడ్డగించారు. కారు అద్దం పగులగొట్టి వ్యాపారిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్లలో కారం చల్లి.. బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటన శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిందన్నారు.
''వ్యాపారి స్వస్థలం మహారాష్ట్ర. బంగారం విలువ సుమారు రూ. 40 లక్షలు ఉంటుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం.''
- పోలీసులు
ఇదీ చదవండి : కంబళ శ్రీనివాస ప్రతిభకు ప్రపంచం సలాం!