ETV Bharat / bharat

'వారి వల్ల పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది' - nitish comment on bjp

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్​డీఏలో సీట్ల సర్దుబాటులో జరిగిన జాప్యం.. తమ పార్టీని మూల్యం చెల్లించుకునేలా చేసిందని ఆరోపించారు.

nitish kumar, jdu, bjp, bihar
'వారి వల్ల పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది'
author img

By

Published : Jan 9, 2021, 10:24 PM IST

ఎన్​డీఏలో సీట్ల సర్దుబాటు ఆలస్యం కారణంగా జేడీయూ భారీ మూల్యం చెల్లించుకుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ అన్నారు. ఈ మేరకు పరోక్షంగా భాజపాపై శనివారం విమర్శలు గుప్పించారు. మిత్రులు ఎవరో తెలుసుకోవడంలో విఫలం అయ్యామని వ్యాఖ్యానించారు.

"ఎన్నికలకు ఐదు నెలల ముందే కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగి ఉండాల్సింది. ఆలస్యం కారణంగా మా పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. సీఎం పదవిపై నాకు ఆశ లేకపోయినా సొంత పార్టీ, భాజపాల నుంచి ఒత్తిడి రావడం వల్ల బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది."

-నితీశ్​ కుమార్, బిహార్​ ముఖ్యమంత్రి

ఎన్​ఆర్సీని అమలు కానివ్వను..

రాష్ట్రంలో ఎన్​ఆర్సీని అమలు కానివ్వని నితీశ్ పేర్కొన్నారు. అమలుకు యత్నిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు తమకు మద్దతుగా నిలిచారని, కానీ తమపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి : టార్గెట్​ నితీశ్- త్వరలోనే కేబినెట్​లోకి చిరాగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.